నాయుడుపేట తెలుగు ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహ భూమిపూజ కార్యక్రమం గురువారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. కొండేపాటి గంగాప్రసాద్, నెలవల సుబ్రహ్మణ్యం సూచనల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని సీఎస్ తేజ హాల్ ఎదురుగా జరగనుంది. కార్యక్రమ విజయవంతం కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు పెద్ద ఎత్తున హాజరుకావాలని నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ పిలుపునిచ్చారు.
previous post
next post