సినిమాహోమ్

అర్జున్‌ అంబటి ‘పరమపద సోపానం’

#ArjunAmbati

అర్జున్‌ అంబటి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

పులగం సుప్రియ సహ నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగశివ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.’పరమపద సోపానం’ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను మా దర్శకుడు తెరకెక్కించాడు.

మాస్ మహరాజా రవితేజ ‘ఈగల్‌’కు సంగీతం అందించిన డేవ్‌ బాండ్‌ మా సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఇప్పటికే విడుదలైన ‘చిన్ని చిన్ని తప్పులేవో, భూమ్‌ భూమ్‌’ లిరికల్‌ సాంగ్స్‌కు, టీజర్‌కు మంచి అప్లాజ్‌ వచ్చింది. ఈ నెల 24న మూవీని రిలీజ్‌ చేస్తున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అర్జున్ అంబటి లుక్‌ ఇంటెన్స్ ఫీల్‌తో ఆకట్టుకునేలా ఉంది.

Related posts

ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam News

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో కాల్పులు

Satyam News

#GoodNews: హోర్మోజ్ జల సంధి దాటిన భారత్ ఎల్పీజీ నౌక

Satyam News

భద్రాచల శ్రీ రాముడి దేవాలయ పునర్నిర్మాణం మొదలు

Satyam News

వాకర్స్ అసోసియేషన్ మెగా వైద్య శిబిరం

Satyam News

పర్యాటక ప్రదేశాలకు విస్తృత ప్రచారం

Satyam News

Leave a Comment