ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ బ్రాండ్ జాకబ్ అండ్ కో (Jacob & Co.) ఒక కొత్త వాచ్ ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జనవరి 21న విడుదల చేసిన ఈ ‘వాంటారా టైమ్‌పీస్’ పై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ గడియారం కేవలం టైమ్ చూపించే వాచ్ కాదు… ఇది ఒక గణాంకాల అద్భుతం, కళాఖండం, ఆభరణాల సమ్మేళనం. గుజరాత్‌లోని అనంత్ అంబానీ వంతారా గ్లోబల్ వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అండ్ కన్జర్వేషన్ సెంటర్ కు నివాళిగా రూపొందించిన ఈ వాచ్ ఒకే ఒక్కటి. మరొకటి తయారు చేసే ఆలోచన కూడా ఆ కంపెనీకి లేదని చెబుతున్నారు. ఈ వాచ్‌లో ప్రత్యేకత ఏమిటంటే…
397 చేతితో అమర్చిన రత్నాలు ఉన్నాయి
దీని మొత్తం బరువు 21.98 క్యారెట్లు (దాదాపు 22 క్యారెట్లు)
డెమాంటాయిడ్ గార్నెట్లు
ట్సావరైట్స్
గ్రీన్ సఫైర్లు
వైట్ డైమండ్లు
డయల్ మధ్యలో అనంత్ అంబానీ చేతితో చిత్రించిన ఫిగరిన్
వన్యప్రాణుల సంరక్షణకు ప్రతీకగా ఒక సింహం
ఒక బెంగాల్ టైగర్ సూక్ష్మాకార రూపంలో ఉన్నాయి
మొత్తం డిజైన్‌కు అనుసంధానంగా గ్రీన్ క్యామఫ్లాజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.
ఈ వాచ్ విడుదలైన వెంటనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒకరు, “ఈ వాచ్‌లో అన్నీ కనిపిస్తున్నాయి… కానీ టైమ్ మాత్రం కనిపించడం లేదు!” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరో యూజర్, “ఇందులో టైమ్ ఎక్కడ చూపిస్తారు?” అని ప్రశ్నించారు. కొంతమంది దీన్ని ఏప్రిల్ ఫూల్స్ ప్రాంక్ అని కూడా అనుమానించగా, మరికొందరు ఏకంగా దీనిని విపరీత ధోరణి అంటూ విమర్శించారు.
అయితే విమర్శలు చేసినవారే చివరకు ఒక విషయం అంగీకరించారు. “వాచ్‌గా ఇది విఫలమయ్యొచ్చు… కానీ కళాఖండంగా మాత్రం అద్భుత విజయం.” గడియారం కాదా… గ్యాలరీలో పెట్టాల్సిన కళాఖండమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వంతారా టైమ్‌పీస్ ఇప్పుడు సమయాన్ని చూపించేదా? లేక సందేశాన్ని చెప్పేదా? అనే చర్చకు దారి తీసింది.
వాచ్ ప్రేమికుల మధ్య ఇది వివాదాస్పదమైనా, ఆర్ట్ & లగ్జరీ ప్రపంచంలో మాత్రం ఇది ఓ మాస్టర్‌పీస్ గా నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
