యలహంక ప్యాలెస్ ఎవరిది..? షర్మిల వర్సెస్ జగన్.. అన్నదా..? చెల్లిదా..? అన్న జగన్.. ఇది తన ప్యాలెస్ అని తీర్మానించారు.. ఇటు షర్మిల తన ఇల్లు అని కూతురు మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంది.. దీనిపై ఇద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తుంటే, పాత అంశాలు మాత్రం ఆ ఇల్లు ఎవరికి చెందుతుంది అనే దానిపై క్లారిటీ ఇస్తున్నాయి.. 2010 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా మేగజైన్ షర్మిల కూతురు అంజలి బర్త్ డే ఈవెంట్ రోజే యలహంక ప్యాలెస్ గృహప్రవేశం జరిగిందని కథనాలు ప్రచురించింది.. తాజాగా, ఇదే అంశాన్ని ఫిక్స్ చేస్తూ తల్లి విజయమ్మ డైరీ సీక్రెట్లు లీక్ అవడం జగన్‌కి భారీ షాక్… వైఎస్ చనిపోవడానికి ముందు రోజు జరిగిన సంభాషణని ఆమె డైరీలో ముద్రించడం విశేషం..
2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో.. ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి రాసిన “నాలో.. నాతో YSR” పుస్తకాన్ని ఎంత వైభవంగా ఆవిష్కరించారో, ఎంతగా ప్రమోట్ చేశారో అందరికీ గుర్తుందే ఉంటుంది. కానీ కాలం మారింది.. అదే పుస్తకంలో విజయమ్మ రాసిన ప్రతీ అక్షరం, వైఎస్సార్ అన్న ప్రతీ మాట.. ఇప్పుడు జగన్ వైఖరిని నడిరోడ్డుపై నిలబెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆ పుస్తకంలో విజయమ్మ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “నేను రిటైరయ్యాక హాయిగా బెంగళూరులో పాప దగ్గర ఉంటాను.. మధ్య మధ్యలో ఫ్యామిలీతో కలిసి ఎస్టేట్‌కు వెళ్లి వస్తుంటాను” అని వైఎస్సార్ తరచూ చెప్పేవారని తెలుస్తోంది. నేను, వైఎస్సార్, జగన్ ఫ్యామిలీ, షర్మిల ఫ్యామిలీ.. మొత్తం పది మంది ‘పర్ఫెక్ట్ 10’ అంటూ ఆ మహానేత ప్రతినిత్యం మురిసిపోయేవారని విజయమ్మే చెప్పింది. కూతురంటే వైఎస్సార్‌కి అంత ప్రాణం. కానీ ఈరోజు అదే బెంగళూరు ప్యాలెస్ కోసం, ఆస్తుల కోసం జగన్ ఆడుతున్న నాటకాలు చూస్తుంటే వైఎస్సార్ ఆత్మ ఎంత ఘోషిస్తుందోనని వైఎస్ అభిమానులు బాధపడుతున్నారు.
వైఎస్సార్ స్వర్గస్తులయ్యాక షర్మిల గురించి విజయమ్మ దిగులుపడుతుంటే.. జగన్ తన తల్లి చేయి పట్టుకుని, “అది నువ్వు నాకు చెప్పాల్సిన విషయమా అమ్మా?” అన్నట్టుగా ఓదార్చారని.. అంతేకాదు, వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడే జగన్ ఆయనతో.. “నాన్నా.. షర్మి గురించి ఎందుకు బెంగపడతారు? మీ తర్వాత ఈ భూమ్మీద పాపకి నన్ను మించిన శ్రేయోభిలాషి ఇంకెవరుంటారు?” అని హామీ ఇచ్చారని విజయమ్మ స్వయంగా ఆ పుస్తకంలో రాసుకొచ్చారు.
మరి ఈరోజు జరుగుతున్నదేంటి? తండ్రి బ్రతికి ఉన్నప్పుడు “షర్మిలకు నేనే పెద్ద దిక్కు” అని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక, ఆస్తులు చేతికి వచ్చాక చెల్లిని ఎలా చూసుకున్నారు? తండ్రి ఆశయాలను, ఇచ్చిన మాటను పక్కనబెట్టి, సొంత చెల్లిని, కన్న తల్లిని రోడ్డుపైకి లాగారు. చిల్లర ఆస్తులు, కంపెనీ షేర్ల కోసం చెల్లిపైనే కోర్టుల్లో కేసులు వేసే స్థాయికి దిగజారారని విమర్శలు మూటగట్టుకున్నాడు. జగన్ నమ్మకద్రోహాన్ని తల్లి విజయమ్మ డైరీ మరోసారి పట్టించిందనే విమర్శలు వస్తున్నాయి. సొంత కేడర్ సైతం షర్మిల కూతురు మ్యారేజ్‌ని అడ్డుకోవడంపై జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
