26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఏపీ లిక్కర్ గ్యాంగ్ తో విజయ్ చెట్టాపట్టాల్.!

#YSAnilReddy

తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని, అవినీతి రహిత పాలన అందిస్తానని..తమిళగ వెట్రి కళగం అధినేత, దళపతి విజయ్ గ్రాండ్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. క్లీన్ గవర్నెన్స్ ఆశిస్తూ లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఆయన వైపు చూస్తున్నారు.

అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే విజయ్ అడుగులు ఎటు పడుతున్నాయనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, రూ. 4వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ అనిల్ రెడ్డితో విజయ్ భేటీ కావడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాడులో DMK ప్రభుత్వానికి సెంథిల్ బాలాజీ వ్యవహారం ఎంత పెద్ద మైనస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీలో అలాంటి ఇమేజ్ ఉన్న వైఎస్ అనిల్ రెడ్డితో విజయ్ భేటీ కావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. పొలిటికల్ సర్కిల్స్‌లో అనిల్ రెడ్డిని ఆంధ్ర సెంథిల్ బాలాజీగా అభివర్ణిస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన రూ. 4,000 కోట్ల భారీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్ అనిల్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2019-24 మధ్య కాలంలో మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెలా రూ. 50 నుండి 60 కోట్ల మేర లంచాలు వసూలు చేశారనేది ఈయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది.

ఒకవైపు అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్తూనే, మరోవైపు ఇలాంటి సీరియస్ అవినీతి ఆరోపణలు, ED కేసులు ఎదుర్కొంటున్న వారితో విజయ్ చెట్టాపట్టాల్ అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో మార్పు కోసం, ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం కోసం కోట్ల మంది ప్రజలు విజయ్‌ని నమ్మారు.

కానీ, పార్టీని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లే ముందే..మొదటి సెట్ మీటింగ్స్‌లోనే ఇలాంటి వివాదాస్పద వ్యక్తులతో దర్శనమివ్వడం విజయ్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమా..? లేక ఈ భేటీ వెనుక ఏదైనా రాజకీయ ముఠా ఉందా..? అనే కోణంలో విశ్లేషణలు నడుస్తున్నాయి. అవినీతి రహిత పాలన అని చెప్పిన విజయ్, ఇలాంటి వారితో భేటీ కావడం TVK శ్రేణులను సైతం డిఫెన్స్‌లో పడేస్తోంది. ఈ భేటీపై విజయ్ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Related posts

ఏడుకొండలపై నాడు కుట్ర….. YSR అరాచక చరిత్ర ఇదే.!

Satyam News

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని విమర్శించే స్థాయి మీకు లేదు

Satyam News

రాష్ట్రం లో వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

తండ్రి సమాధి సాక్షిగా తల్లిని అవమానించిన జగన్

Satyam News

లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

Satyam News

సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే

Satyam News

Leave a Comment