అనంతపురంహోమ్

కళ్యాణదుర్గం వైకాపా ‘కుబేరుడు’… ఒక ఫోటోషాప్!

#YCPLeader

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ 7 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చూస్తుంటే  వైకాపా లిక్కర్ స్కామ్ డైరెక్టర్లు కూడా బిక్కమొహం వేయాల్సిందే. ఏకంగా ఏడు పక్కన పన్నెండు సున్నాలు పెట్టి, ప్రపంచ ధనవంతుల జాబితానే మార్చేయబోయాడు ఈ వైకాపా నేత ఎర్రిస్వామి. తన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయట.. కానీ అవి బయటకు తీయడానికి మాత్రం జనం దగ్గర రూ. 3 కోట్లు అప్పు కావాలట!

ఇదీ ఆయన చెప్పిన మాట. దీన్ని ఆయన అందరితో చెప్పి నమ్మించాడు కూడా. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నరే మనోడి కాళ్ళ మీద పడి, “స్వామి.. నీ అకౌంట్లో ఉన్న లక్షల కోట్లు తీసుకోకపోతే దేశం నాశనమైపోతుంది, ఒక సంతకం పెట్టు నాయనా” అని బతిమిలాడినట్లు ఫోటోషాప్ లో లెటర్లు సృష్టించాడు. ఈ నకిలీ పేపర్లు చూసి మనోళ్లు.. “రేపు పొద్దున్నే కళ్యాణదుర్గాన్ని అమెరికా చేసేస్తాడు మన నేత” అని మురిసిపోయి, అడిగినంత ఇచ్చేశారు.

లోకంలో ఎవరైనా ధనవంతులు దానాలు చేస్తారు. కానీ మన హైటెక్ బాబు మాత్రం.. “నా లక్షల కోట్లు ఫ్రీజ్ అయ్యాయి, ఆ లాక్ తీయడానికి తాళం చెవి (ప్రాసెసింగ్ ఫీ) కొనుక్కోవాలి.. మీ దగ్గర ఉన్న రూ. 3 కోట్లు ఇవ్వండి” అని వసూళ్లు మొదలెట్టాడు. జనం కూడా ” రూ.7 లక్షల కోట్లలో మనకు ఒక లక్ష ఇచ్చినా చాలు కదా” అని ఎగబడి మరీ ఇచ్చారు. ఇందులో పేటీఎంలు  ఎక్కువ మంది ఉన్నారు.

పాపం, ఎర్రిస్వామి గారు ఆ కోట్లు ఖర్చు చేసే లోపే పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. “నీ గ్రాఫిక్స్ మాకు చూపించు నాయనా” అని లోపలికి తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీసులు ఆ లక్షల కోట్ల కోసం వెతుకుతున్నారు.. బహుశా అవి ఎర్రిస్వామి వాడిన ‘ఫోటోషాప్’ రీసైకిల్ బిన్ లో పడి ఉండి ఉంటాయి!

స్కామ్ చేసేవాడు తెలివైన వాడు కాదు.. వాడు పార్టీ నేత కాబట్టి, మన నాయకుల ‘బినామీ’ అనుకుని మోసపోయే అమాయకులు ఉన్నంత కాలం ఇలాంటి “ఎర్రి” వేషాలు సాగుతూనే ఉంటాయి. వీడిని, ఇలాంటి పార్టీలను వెనకేసుకొచ్చే ‘పేటీఎం’ బ్యాచ్ ఉన్నంత వరకు ఈ కామెడీకి ఎండ్ కార్డు పడదు!

Related posts

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News

సౌదీ ఆరామ్ కో రిఫైనరీని పేల్చేసిన ఇరాన్

Satyam News

ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం

Satyam News

యుఏఈ తో భారత్ కీలక ఇంధన ఒప్పందం

Satyam News

టీటీడీ కాలేజీల ఆన్ లైన్ అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

Leave a Comment