విశాఖపట్నంహోమ్

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్….. మళ్లీ భూమిపూజపై క్లారిటీ.!

#PVSindhu

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్ అకాడమీ భూమిపూజ అంశాన్ని రాజకీయం చేస్తూ..నారా లోకేష్ క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలు వండి వార్చాయి. గతంలోనే భూమి పూజ జరిగినా, లోకేష్ కోసం మళ్లీ తంతు జరిపారంటూ తప్పుడు ప్రచారం చేశాయి. అయితే, ఈ ఫేక్ ప్రచారానికి PV సింధు స్వయంగా చెక్ పెట్టారు. X వేదికగా తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు.

తాము మరోసారి భూమి పూజ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై పీవీ సింధు తన ట్వీట్‌లో స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. మొదటిసారి భూమి పూజ కేవలం 7 గంటల నోటీసుతో హడావుడిగా జరిగింది. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, గ్రీన్‌కో నుంచి స్వాతి అక్క, అనిల్ అన్నా..ఇలా మొదటి రోజు నుంచి ఈ కల సాకారమవడానికి వెన్నంటి నిలిచిన ఏ ఒక్కరూ అక్కడ లేరని సింధు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమో, క్రెడిట్ కోసమో కాకుండా.. తన స్వప్నంలో భాగమైన ఆప్తులందరి సమక్షంలో ఈ వేడుకను జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగిందని తేల్చిచెప్పారు.

సాధారణ బ్యాడ్మింటన్ అకాడమీగా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ను..సీఎం చంద్రబాబు గారి మార్గదర్శకత్వంలో మరింత ఉన్నత స్థాయికి విస్తరించాలని భావించినట్లు సింధు వెల్లడించారు. దీన్ని కేవలం అకాడమీగా కాకుండా, ఒక నిజమైన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌గా మలచాలని నిర్ణయించామన్నారు. ఈ కొత్త ఆరంభానికి తమతో కలిసి రావాలని మంత్రి నారా లోకేష్‌ను ఆహ్వానించడం, ఆయన వేడుకలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక నుంచి 2028 లక్ష్యంగా పూర్తి వేగంతో పనులు ముందుకు సాగుతాయని స్పష్టం చేస్తూ త్రివర్ణ పతాకంతో కూడిన పోస్ట్ పెట్టారు.

గతంలో ఏదో హడావుడిగా జరిగిపోయిన చిన్న స్థాయి ఏర్పాట్లను పెద్దది చేసి, కేవలం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై బురదజల్లేందుకే వైసీపీ అనుకూల మీడియా నానా యాగీ చేసింది. లోకేష్ క్రెడిట్ కోసమే తాపత్రయపడుతున్నారంటూ సాక్షి వంటి పత్రికలు రాసిన కథనాలు పూర్తిగా కట్టుకథలని పీవీ సింధు ఇచ్చిన వివరణతో తేటతెల్లమైంది.

Related posts

ట్రంప్ విధానాలపై అమెరికా లో నిరసనల హోరు

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు

Satyam News

అక్రమ వలసలపై అధ్యయన కమిటీ ఏర్పాటు

Satyam News

పాకిస్తాన్ కు మళ్లీ హెచ్చరిక జారీ చేసిన భారత్

Satyam News

క్లర్క్, లేడీ కానిస్టేబుల్ రాసలీలలు..!

Satyam News

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి

Satyam News

Leave a Comment