శ్రీకాకుళంహోమ్

మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ నేత అరెస్టు

#ChintadaRavikumar

మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించి గత 10 రోజులుగా పరారీలో ఉన్న వైసీపీ నేత, వైసీపీ ఆముదాలవలస ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సీఎంకున్న ప్రోటోకాల్ ప్రకారం జగన్ రెడ్డి పర్యటన జరుగుతున్న తన పరిధిలో ఉన్న ప్రాంతంలో బందోబస్తు పర్యవేక్షణకు వచ్చిన మహిళా ఎస్సై పట్ల వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించారు.

యూనిఫాంలో ఉన్న ఎస్సై పట్ల వైసీపీ మూక ప్రవర్తించిన హేయమైన తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలాయి. ​కేసు నమోదు అవ్వగానే 10 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నాడు సదరు వైసీపీ నాయకుడు. రేపు ఆదివారం అనగా ఇవాళ ఎచ్చెర్ల మండలం చిలకపాలెం దగ్గర  మాస్క్ వేసుకుంటే గుర్తు పట్టరని అతను జాగ్రత్తపడ్డాడు. అయినా టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికాడు.

డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తుండగా చిలకపాలెం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వైసీపీ అంటున్నది. ఇప్పటికే తాము హైకోర్టును ఆశ్రయించామని, కేసు కోర్టులో ఉండగా ఇలా అరెస్టు చేయడం తగదని వారు అంటున్నారు.

Related posts

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News

కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News

సినీ జంట కు డీఎన్ఏ పరీక్ష

Satyam News

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై భారత్‌లో ప్రకంపనలు!

Satyam News

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

Satyam News

పాకిస్తాన్ కు మళ్లీ హెచ్చరిక జారీ చేసిన భారత్

Satyam News

Leave a Comment