ముఖ్యంశాలుహోమ్

దూసుకువస్తున్న “డిట్వా” తుఫాను

#Rain

“డిట్వా” తుఫాను నేరుగా చెన్నై వైపు దూసుకువస్తుండటంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ముప్పు పొంచి ఉంది. నవంబర్ 30వ తేదీ రాత్రి సమయానికి ఈ తుఫాను వాయుగుండం లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని బలమైన సంకేతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇది వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి, డిసెంబర్ 2వ తేదీ వరకు (సుమారు 30 గంటల పాటు) తిరుపతి,  నెల్లూరు జిల్లాల పరిసరాల్లోనే తిరుగుతూ అక్కడే స్థిరపడే అవకాశం ఉంది.

దీని ప్రభావం వల్ల నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా కావలి నుండి ఉత్తర నెల్లూరు ప్రాంతాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించవచ్చు. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపించనుంది.

Related posts

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

Satyam News

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ – వైసీపీ పొత్తు…?

Satyam News

సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

Satyam News

IAS శ్రీలక్ష్మికి గౌరవ వీడ్కోలు..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

Satyam News

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News

రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి

Satyam News

Leave a Comment