26.3 C
Hyderabad
September 19, 2026
సంపాదకీయంహోమ్

నువ్వు ముస్లిం అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా రహమాన్?

#ARRahaman

మణిరత్నం ఇచ్చిన అవకాశాలతో మహా సంగీత దర్శకుడుగా ఎదిగిపోయిన ఏ ఆర్ రహమాన్ ఇప్పుడు తన మతం వల్లే తనకు అవకాశాలు రావడం లేదని దొంగ ఏడుపులు మొదలు పెట్టాడు. రహమాన్ సంగీత దర్శకుడుగా వచ్చినప్పుడు బాలివుడ్ లో గానీ దక్షిణాది చలన చిత్ర రంగంలో గానీ పాపులర్ సంగీత దర్శకులు ఎవరూ కూడా తమకు అవకాశాలు పోయాయని ఏడవ లేదు.

రహమాన్ వల్ల తమవ అవకాశాలు దెబ్బతిన్నాయని, ఒక ముస్లిం కు అవకాశాలు ఎందుకు ఇస్తున్నారని ఎవరూ నిర్మాతలను ప్రశ్నించలేదు. అలాంటిది ఇప్పుడు రహమాన్ తన కు అవకాశాలు రాకపోవడాన్ని ఒక మత వివాదంలా మార్చాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. నిజానికి రహమాన్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం ఒకే మూసలో బాణీలు ఇవ్వడమే. కొత్త బాణీలు ఇస్తున్నాడని నిర్మాతలు ఏ ఆర్ రహమాన్ ను ప్రోత్సహించారు.

రహమాన్ ఇప్పటికీ పాత బాణీలనే ఇవ్వడం వల్ల అతడికి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సినీ పరిశ్రమను అడ్డంపెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించిన రహమాన్, ఇప్పుడు కొత్త వారికి అవకాశం దక్కుతుంటే తన మతాన్ని చూసి అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పడం పట్ల అసూయ కనిపిస్తున్నది తప్ప వేరేది లేదు. ఏఆర్ రహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి.

గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయని, ఇందుకు ఇండస్ట్రీలో చోటుచేసుకున్న “పవర్ షిఫ్ట్” కూడా ఒక కారణమై ఉండొచ్చని రహమాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో మతపరమైన కోణం కూడా ఉండవచ్చన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటంతో వివాదం చెలరేగింది. ఒక టివీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రహమాన్ మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో తన పని పరిమితమైందని, అయితే తాను దీనిని వ్యక్తిగతంగా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

తీవ్రంగా స్పందించిన కంగనా రనౌత్

అనంతరం వివాదం పెరగడంతో స్పందించిన ఆయన, తన మాటల ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని, భారత్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. రహమాన్ వ్యాఖ్యలు పక్షపాతంతో కూడినవని ఆమె ఆరోపించారు. తాను సినీ పరిశ్రమలో చూసిన వారిలో ఇంత ద్వేషభావంతో మాట్లాడిన వ్యక్తిని చూడలేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

తనతో పనిచేయడానికీ రహమాన్ ఆసక్తి చూపలేదని కూడా ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రముఖ గీత రచయిత, స్క్రీన్‌రైటర్ జావేద్ అక్హ్తార్ మాత్రం రహమాన్ వ్యాఖ్యలను సమర్థించలేదు. బాలీవుడ్‌లో కమ్యూనల్ లేదా మతపరమైన కోణం లేదని ఆయన స్పష్టం చేశారు.

చాలా మంది మైనారిటీలు ప్రముఖ స్థానాలలో ఉన్నారు కదా?

పరిశ్రమలో ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు వస్తాయని, రహమాన్ లాంటి గొప్ప కళాకారుడి మాటలను తప్పుగా అర్థం చేసుకోకూడదని అన్నారు. ప్రముఖ గాయకుడు షాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సంగీత రంగంలో మతపరమైన వివక్ష లేదని, మంచి పని చేసే వారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. బాలీవుడ్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు కళాకారులు అగ్రస్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు.

రచయిత, కాలమిస్ట్ శోభా డే రహమాన్ వ్యాఖ్యలను “అసహజమైనవి, ప్రమాదకరమైనవి”గా అభివర్ణించారు. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరమైన విభేదాలకు దారి తీయవచ్చని హెచ్చరించారు. రహమాన్ వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన స్పందనలతో బాలీవుడ్‌లో మళ్లీ కమ్యూనల్ కోణం, పవర్ సెంటర్ల మార్పు వంటి అంశాలపై చర్చ మొదలైంది. అయితే రహమాన్ మాత్రం వివాదాలకు దూరంగా ఉండాలని, తన దృష్టి సంగీతం మీదే అని స్పష్టం చేస్తున్నారు.   

Related posts

దేశ మహిళలను మోసం చేసిన బీజేపీ

Satyam News

ఇరాన్ ఇంధన ప్లాంట్ లపై దాడి 5 రోజులు వాయిదా

Satyam News

జైలు శాఖ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష

Satyam News

అర్జున్‌ అంబటి ‘పరమపద సోపానం’

Satyam News

ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖ

Satyam News

నిన్న BR నాయుడు..ఇవాళ ABN…. జగన్‌ శత్రువులు ఎవరు?

Satyam News

Leave a Comment