ముఖ్యంశాలుహోమ్

సవరించిన జీవో ప్రకారం కొత్త అక్రెడిటేషన్ లు

అక్రెడిటేషన్ కార్డులు జారీ మరియు అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు ప్రక్రియపై మంత్రి సూచనలు జారీ చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా మరియు వేగవంతంగా నిర్వహించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సవరించిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీమంత్రి మాట్లాడుతూ, అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జి.ఓ. 252 విడుదల చేసిందన్నారు. అనంతరం వివిధ జర్నలిస్టు సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వారి సూచనలు మరియు అభ్యర్థనలను సమగ్రంగా పరిశీలించిన తరువాత అవసరమైన సవరణలు చేసి జి.ఓ. 103ను విడుదల చేసినట్లు తెలిపారు.

ఈ సవరణలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాలకు కలిపి మొత్తం 44,706 అక్రెడిటేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.ఇంతకుముందు సుమారు 23,000 మంది జర్నలిస్టులు మాత్రమే అక్రెడిటేషన్ కార్డులు కలిగి ఉండగా, తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 21,000 కంటే ఎక్కువ కార్డులు పెరుగుతుందని మంత్రి తెలిపారు.

కేటగిరీల వారీగా కార్డుల కేటాయింపుప్రింట్ మీడియా2.50 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలు – 6,256 కార్డులు75,000 నుండి 2.50 లక్షల మధ్య సర్క్యులేషన్ ఉన్న 24 పత్రికలు – 17,784 కార్డులు25,001 నుండి 75,000 మధ్య సర్క్యులేషన్ ఉన్న 30 పత్రికలు – 3,390 కార్డులు

15,001 నుండి 25,000 మధ్య సర్క్యులేషన్ ఉన్న 169 చిన్న పత్రికలు – 11,661 కార్డులు15,000 కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న 113 చిన్న పత్రికలు – 226 కార్డులుపీరియాడికల్స్ – 624 కార్డులు20 న్యూస్ ఏజెన్సీలు – 68 కార్డులుఎలక్ట్రానిక్ & డిజిటల్ మీడియా21 శాటిలైట్ ఛానళ్లు – 4,431 కార్డులు

8 జాతీయ ఛానళ్లు – 32 కార్డులు100 లోకల్ కేబుల్ ఛానళ్లు – 200 కార్డులుడిజిటల్ మీడియా – 10 కార్డులుమొత్తం కలిపి 44,706 అక్రెడిటేషన్ కార్డులు కేటాయించబడ్డాయి.స్థాయి వారీగా జారీరాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో – 16,056 కార్డులునియోజకవర్గం మరియు మండల స్థాయిలో – 28,650 కార్డులు

నిరంతర ప్రక్రియఅక్రెడిటేషన్ కార్డుల జారీ ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. తదుపరి అవసరాల మేరకు మరిన్ని కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

Related posts

ఆటో డ్రైవర్లకు 16 కండిషన్లు

Satyam News

మోసం చేసిన వైసీపీ నేత ఇల్లు ముట్టడి

Satyam News

సంగారెడ్డి లో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

Satyam News

రేవంత్ వ్యూహంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి…..

Satyam News

Karnataka Politics: ప్రియాంక్ ఖార్గేపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు

Satyam News

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

Satyam News

Leave a Comment