సినిమాహోమ్

Box Office: కలెక్షన్లు తగ్గని దురంధర్ 2

#Durandhar2

గత వారం వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన దురంధర్ 2 ఇప్పుడు మరో వంద కోట్లు అదనంగా సాధించి బాక్సాఫీస్ ను ఇంకా కలెక్షన్లతో ముంచెత్తుతూనే ఉన్నది. బాలీవుడ్‌లో Dhurandhar The Revenge బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ నాలుగో వీకెండ్‌లో కూడా ఎటువంటి పోటీ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా రన్ కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి స్థిరమైన వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం, నాలుగో వారంలో రూ.50 కోట్ల మార్క్‌ను సులభంగా దాటే దిశగా ముందుకు సాగుతోంది.

వారాంతపు రోజుల్లో కొంతమేర వసూళ్లు తగ్గినప్పటికీ, బుధవారం రూ.8 కోట్లు, గురువారం రూ.7 కోట్లు, శుక్రవారం రూ.6 కోట్లతో కలెక్షన్లు సింగిల్ డిజిట్‌లోకి వెళ్లాయి. అయితే శనివారం ఒక్కసారిగా భారీ జంప్‌తో రూ.12 కోట్లు వసూలు చేసి మళ్లీ జోరు చూపించింది. ఈ ఉత్సాహం ఆదివారం కూడా కొనసాగడంతో, వీకెండ్ మొత్తంగా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది.

దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోగా నటించిన రణ్ వీర్ సింగ్ కు ఇది మరో భారీ హిట్‌గా నిలుస్తోంది. హిందీ వెర్షన్ కలెక్షన్లు ఇప్పటికే రూ.1,040 కోట్లకు చేరగా, ఈ వారం రూ.1,050 కోట్ల మైలురాయిని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత వారం రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా, ఇప్పుడు రూ.1,100 కోట్ల మార్క్ వైపు వేగంగా దూసుకుపోతోంది. ఇక దక్షిణ భారత భాషలతో కలిపి మొత్తం వసూళ్లు రూ.1,200 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొత్తంగా, భారీ ఓపెనింగ్ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ, Dhurandhar The Revenge బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది.

Related posts

గద్వాల జిల్లా కోర్టు సముదాయం పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

Satyam News

భవిష్యత్తు కోసం ఎదురుచూడం… నిర్మిస్తాం

Satyam News

చట్టాన్ని గౌరవించాలి సంయమనం పాటించాలి

Satyam News

హాంటా వైరస్ తో ఇద్దరు భారతీయ నౌకా సిబ్బంది?

Satyam News

విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ ప్రజాదర్బార్

Satyam News

కొడుకు సంతానానికి తల్లిగా మారిన తల్లి…….?

Satyam News

Leave a Comment