మహబూబ్ నగర్హోమ్

కొల్లాపూర్ లో కెనరా బ్యాంకు ప్రారంభం

#Kollapur

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు జూపల్లి అరుణ్ ప్రారంభించారు. కెనరా బ్యాంక్ వారి ఆహ్వానం మేరకు నేడు కొల్లాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు ను జూపల్లి అరుణ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా జూపల్లి అరుణ్ మాట్లాడుతూ కెనరా బ్యాంకు ద్వారా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో గల రైతులకు వ్యాపారులకు, ప్రజలకు కెనరా బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండే విధంగా చేస్తూ కెనరా బ్యాంకు ద్వారా రైతులకు వ్యాపార సంస్థలకు చిరువ్యాపారులకు రుణాలు అందించే విధంగా కృషి చేయాలి అని కెనరా బ్యాంక్ సిబ్బందికి తెలియచేశారు.

కెనరా బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జూపల్లి అరుణ్ కి కెనరా బ్యాంక్ సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు జూపల్లి అరుణ్ తో పాటుగా యన్మనుబెట్ల మాజీ సర్పంచ్ మేకల నాగరాజు కొల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు షేక్ రహీం పాష మేకల శిరీష, కెనరా బ్యాంక్  ఏజీఎం వెంకటేశ్వర్ రెడ్డి  మేనేజర్ రవీందర్ రెడ్డి, కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పురుషుడిలో స్త్రీ లక్షణాలు: గుంటూరు లో అరుదైన వ్యాధి

Satyam News

మీడియాకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

Satyam News

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు

Satyam News

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఏ మేరకు?

Satyam News

నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ

Satyam News

Gen Z అంటే ఏమిటి

Satyam News

Leave a Comment