కడపహోమ్

వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలిపోయింది

#ChandrababuNaidu

మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయని, ఈ హత్య వెనుక ఉన్న అంతిమ లబ్ధిదారులెవరో కూడా తేలిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.40 కోట్ల సుపారీ వ్యవహారంపై గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

వై ఎస్ వివేకానందరెడ్డి హత్య నిందను తనపై మోపి, సొంత పత్రిక సాక్షిలో ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కథనాలు రాయించారని చంద్రబాబు ఆరోపించారు. అయితే నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని, నిజం నిప్పులాంటిదని, దానితో చెలగాటం ఆడితే ఏదో ఒక రోజు అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు.

సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలోనూ వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యవహారానికి సంబంధించిన అంతిమ లబ్ధిదారులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలోనూ ఆరోపణల దిశ గొడ్డలి పార్టీ అధినేత వైపే చూపిస్తోందని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్య కేసు, మద్యం కుంభకోణానికి సంబంధించి తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.

తనపై ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ఆయా కేసుల్లో వెలుగులోకి వస్తున్న అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రొద్దుటూరు సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వివేకానందరెడ్డి హత్య కేసు, మద్యం కుంభకోణం అంశాలను చర్చనీయాంశంగా మార్చాయి.

Related posts

కడుపు నొప్పితో వెళితే కాటికి పంపిన వైద్యులు

Satyam News

నవమల్లెతీగ 100వ సంచికను ఆవిష్కరించిన మంత్రి సవిత

Satyam News

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

Satyam News

జగన్‌కి ఢిల్లీ సంకేతాలు…. బెంగళూరులో ఆ నేతలతో సీక్రెట్ మీటింగ్!

Satyam News

పాకిస్తాన్ నుంచి వచ్చి…. లవ్ జిహాద్….

Satyam News

క్షేత్ర స్థాయిలో బలం… పోరాడే గుణం… సువేందు

Satyam News

Leave a Comment