ప్రపంచంహోమ్

ట్రంప్ ను తొలగించాలని డెమొక్రాట్ల డిమాండ్

#DonaldTrump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. దీంతో అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్‌పై అణుదాడి చేస్తానని లేదా ఒక నాగరికతనే అంతం చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో, సుమారు 85 మందికి పైగా డెమొక్రాటిక్ ప్రజాప్రతినిధులు (లా మేకర్స్) ట్రంప్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని 25వ సవరణను ప్రయోగించడం ద్వారా లేదా ఇంపీచ్‌మెంట్ (అభిశంసన) ప్రక్రియ ద్వారా ఆయనను గద్దె దించాలని వారు పట్టుబడుతున్నారు.

ట్రంప్ మానసిక స్థితి నిలకడగా లేదని, ఆయన చేతిలో అణు రహస్య కోడ్‌లు ఉండటం ప్రపంచానికే ప్రమాదమని అలెక్సాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ (AOC), ఇలాన్ ఒమర్ వంటి ప్రముఖ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, కేబినెట్ వెంటనే స్పందించాలని కోరారు.

ఆశ్చర్యకరంగా, ట్రంప్ సన్నిహితురాలుగా పేరున్న మార్జోరీ టేలర్ గ్రీన్ వంటి వారు కూడా ఆయన చర్యలను “పిచ్చి పని”గా అభివర్ణిస్తూ 25వ సవరణను సమర్థించడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్ తొలగింపు అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

Related posts

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

Satyam News

జనం మెచ్చిన వారికే టికెట్లు..!

Satyam News

ప్రధాని మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Satyam News

కొత్త కోడలిపై కిరాతకం: దుర్గమ్మతో ఆటలు…

Satyam News

ఒంటిమిట్ట అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Satyam News

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News

Leave a Comment