ప్రపంచంహోమ్

ట్రంప్ డ్రామాలతో యూరప్ కు జెంప్

#Trump

గ్రీన్ కార్డు అంశంలో అమెరికా ఆడుతున్న గేమ్స్ భారతీయ విద్యార్ధుల పాలిట శాపంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు అందరూ ఇప్పుడు యూరప్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఇమ్మిగ్రేషన్ మెమోతో వీసాలు, వర్క్ పర్మిట్లు, గ్రీన్ కార్డ్ అవకాశాలపై అనిశ్చితి మరింత పెరిగింది.

అమెరికా పౌరసత్వ మరియు ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ విడుదల చేసిన తాజా మెమోలో, అమెరికాలో నుంచే శాశ్వత నివాస హక్కు లేదా గ్రీన్ కార్డ్ పొందడం హక్కు కాదని, అది ప్రభుత్వ విచక్షణాధికార పరిధిలో ఉండే ప్రయోజనమని స్పష్టం చేసింది.

ఈ ప్రకటనతో చట్టాల్లో ఎలాంటి మార్పులు రాకపోయినా, అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా అవకాశాలు కఠినతరమవుతున్నాయనే భావన బలపడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి ఓపిటి, స్టెమ్ ఓపిటి కార్యక్రమాలపై పెరుగుతున్న పరిశీలన, హెచ్ వన్ బి వీసా లాటరీపై కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచింది.

గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా వస్తున్న ఇమ్మిగ్రేషన్ సంబంధిత అనిశ్చితులు అమెరికాపై విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని విద్యా రంగ ప్రతినిధులు చెబుతున్నారు.

దీంతో భారతీయ విద్యార్థులు ఇప్పుడు యూరప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు స్థిరమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, స్పష్టమైన చదువు అనంతర ఉద్యోగ అవకాశాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.

అమెరికాలో దీర్ఘకాలిక ఉద్యోగాలు, గ్రీన్ కార్డ్ అవకాశాలపై పెరుగుతున్న అనిశ్చితి “అమెరికన్ డ్రీమ్”పై భారతీయ విద్యార్థుల ఆలోచనా విధానాన్ని మార్చడం ప్రారంభించిందని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

పాకిస్తాన్ పైశాచికం: భారత్ నౌకను ఢీ కొట్టిన వైనం…

Satyam News

భూ కబ్జాదారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు: రంగ‌నాథ్ (హైడ్రా)

Satyam News

జవాన్ల సంక్షేమానికి మోదీ సర్కార్ కు అత్యంత ప్రాధాన్యత

Satyam News

యుద్ధంలో ముగ్గురు భారతీయ సీఫేరర్ల మృతి

Satyam News

మోదీ, అమిత్ షాలు రాజీనామా చేయాలి

Satyam News

రికార్డు స్థాయిలో ఒకే రోజులో 9 మంది నేరస్తుల అరెస్టు

Satyam News

Leave a Comment