ఆధ్యాత్మికం హోమ్

టిటిడి డైరీలు, క్యాలెండర్లకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

#Tirumala

టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీ‌వారి భ‌క్తుల నుండి  విశేష స్పంద‌న వ‌స్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు – 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు – 75 వేలు, పెద్ద డైరీలు – 8.50 లక్షలు, చిన్నడైరీలు – 3 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు – 2.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు – 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు – 3 లక్షలు, టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు – 10 వేలు అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది.

ధరలు ఇలా ఉన్నాయి…

12 పేజీల క్యాలెండర్ రూ.130/-,

డీలక్స్ డైరీ రూ.150/-,

చిన్న డైరీ రూ.120/-,

టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75/-,

6 పేజీల 3డి డిజిట‌ల్‌ క్యాలెండర్ రూ.450/-,

శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20 /-,

శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20 /-,

శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15 /-,

తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30/-.

టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు – రూ.130/-.

తిరుమ‌ల, తిరుప‌తిలో….

తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.

బ‌య‌టి ప్రాంతాల్లో…

చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీ‌వారి ఆల‌యాలు, ముంబ‌యి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు  టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల‌ కోసం డైరీలు, క్యాలెండర్లు సిద్ధంగా ఉంచారు.‌

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు

అదేవిధంగా డైరీలు, క్యాలెండర్లు టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది.  ఇందులో 12 పేజీల క్యాలెండర్, డీలక్స్ డైరీ,  చిన్న డైరీ, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్, 6 పేజీల 3డి  క్యాలెండర్ లను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు తపాలా శాఖ ద్వారా పంప‌బ‌డుతుంది.

డిడి తీసి పంపొచ్చు…

భక్తులు డిడి తీసి పంపినా టిటిడి క్యాలెండర్‌, డైరీలను  పొందవచ్చు. ఇందుకోసం ” కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి ” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ష డెప్యూటీ ఈవో, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి ” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. తపాలా శాఖ ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్‌, డైరీలను పంపడం జరుగుతుంది. రవాణా ఛార్జీలను అదనంగా తపాలా శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.

క్యాలెండర్‌, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.

Related posts

తిరుపతి షిర్డీ మధ్యన వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు

Satyam News

ఆర్థిక నేరం కేసులో రమేష్ అరెస్ట్

Satyam News

30 వేల మందిని తొలగించనున్న అమెజాన్

Satyam News

Leave a Comment

error: Content is protected !!