ప్రపంచంహోమ్

విమానంలో అసభ్య ప్రవర్తన: ఆస్ట్రేలియాలో భారతీయుడి అరెస్టు

#RapeVictim

అంతర్జాతీయ విమానంలో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక భారతీయుడిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాలోని పర్థ్‌కు వెళ్తున్న అంతర్జాతీయ విమానంలో ఈ ఘటన వారం రోజుల కిందట జరిగింది, అయితే ఈ సంఘటన ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసుల ప్రకారం, విమానం ప్రయాణిస్తున్న సమయంలో పక్క సీటులో కూర్చున్న మహిళపై 52 ఏళ్ల భారతీయుడు అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. బాధిత మహిళ వెంటనే విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చింది. దీనితో సిబ్బంది ఆమెను మరో సీటుకు మార్చి భద్రత కల్పించారు. అంతేకాకుండా, పరిస్థితిని పర్యవేక్షిస్తూ కంట్రోల్ రూం లో ఉన్న భద్రతా అధికారులకు ముందుగానే సమాచారం అందించారు.

విమానం పర్థ్‌కు చేరుకున్న వెంటనే పోలీసులు విమానంలోకి ఎక్కి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం అతడిని సుధీర్ కుమార్ చౌహాన్‌గా గుర్తించారు. అతను మహిళ అనుమతి లేకుండా శారీరక సంబంధానికి యత్నించడం, అనేక అసభ్యకర చర్యలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేశారు.

కోర్టు నిందితుడికి బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం అతను అదుపులోనే ఉండగా, శుక్రవారం బెయిల్‌పై విచారణ జరగనుంది. లైంగిక దాడి కేసుల్లో బాధితుల గోప్యతను కాపాడే నిబంధనల ప్రకారం మహిళ వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారి పీటర్ బ్రిండల్, విమాన ప్రయాణంలో ప్రతి ప్రయాణికుడికి భద్రత హక్కు ఉందని తెలిపారు. విమానం వంటి పరిమిత స్థలంలో ఇటువంటి సంఘటనలు మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయని చెప్పారు. ఏవైనా అనుచిత ఘటనలు జరిగితే వెంటనే విమాన సిబ్బందికి లేదా భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

విమానాలలో అనుమతి లేకుండా చేసే ఏ విధమైన ప్రవర్తనను కూడా తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సంబంధిత విమాన సంస్థ ఇప్పటివరకు పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేయలేదు.

Related posts

ప్రముఖ సినీ నటి పావలా శ్యామల కన్నుమూత

Satyam News

‘లూయిస్ వ్యూట్టన్’లో రాజ్ దాసిరెడ్డి సందడి

Satyam News

ఎన్నికల వ్యవస్థపై రాహుల్ ‘జ్ఞానోదయం’.!

Satyam News

వ‌న‌స్థ‌లిపురం పీఎస్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై ఫిర్యాదు

Satyam News

రియల్ హీరో సుధాకర్: పాములు పట్టి అడవుల్లో విడిచే సేవ

Satyam News

ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్‌ ను అధిగమించవచ్చు

Satyam News

Leave a Comment