సినిమాహోమ్

అంతులేని కథ కు 50 ఏళ్లు

మధ్య తరగతి కుటుంబ కథలతో హృదయాలను హత్తుకొనేలా చిత్రాలు రూపొందించడంలో మేటి అనిపించకున్నారు కె.బాలచందర్. అంతకు ముందు మూడు నాలుగు చిత్రాల్లో నటించిన జయప్రద ను టీనేజ్‌లోనే బరువైన పాత్ర పోషించేలా చేసి అంతులేని కథ రూపొందించారు బాలచందర్. తమిళంలో ఆయన డైరెక్షన్ లోనే రూపొందిన ‘అవళ్ ఒరు తోడర్ కథై’ ఆధారంగా ‘అంతులేని కథ’ తెరకెక్కింది. తమిళ సినిమాతో సుజాతకు ఎంతో పేరు లభించింది. ‘అంతులేని కథ’ ద్వారా జయప్రదకు ఎనలేని ఖ్యాతి దక్కింది.

1976 ఫిబ్రవరి 27వ తేదీన విడుదలైన ‘అంతులేని కథ’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో నటించిన ఎందరికో చిత్రసీమలో గుర్తింపును లభించింది. ఈ మూవీతోనే రజనీకాంత్, కమల్‌ హాసన్ తెలుగుతెరకు పరిచయం కావడం విశేషం. అలాగే శ్రీప్రియ, ఫటాఫట్ జయలక్ష్మి మంచి గుర్తింపు పొందారు. ‘వికటకవి’గా అలరించిన నారాయణరావుకు కూడా ‘అంతులేని కథ’తోనే తరువాత హీరో అవకాశాలు లభించాయి.

‘అంతులేని కథ’లో ప్రధాన పాత్ర సరితగా జయప్రద అభినయం ఆమె కెరీర్‌నును ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమాలో నటించడం వల్లే కె.విశ్వనాథ్ ‘సిరిసిరిమువ్వ’లో నటనకు ఎంతో ప్రాధాన్యమున్న మూగ పిల్ల పాత్రను ధరించి మెప్పించారు జయప్రద. తరువాతి కాలంలో తమిళనాట సూపర్ స్టార్స్ గా వెలుగొందిన రజనీకాంత్, కమల్ హాసన్ కు తెలుగులో మంచి గుర్తింపును ఇచ్చిందీ చిత్రం. ఈ మూవీ కారణంగానే రజనీకాంత్‌కు కొన్ని తెలుగు సినిమాల్లో నటించే అవకాశం లభించింది. ఇందులో హీరోయిన్ అన్న మూర్తి పాత్రలో రజనీకాంత్ అభినయం తెలుగువారిని అలరించింది.కొత్త సినిమాలు

తన కుటుంబం కోసం ఎప్పుడూ త్యాగం చేస్తూనే సాగిన సరిత చెల్లెలి కోసం తన ప్రేమను త్యాగం చేస్తుంది. చివరకు పెళ్ళి చేసుకోవాలని ఆశిస్తుంది. అదే సమయంలో ఆమె అన్న హత్యకు గురి కావడంతో మళ్ళీ సరిత జీవితం మొదటికే అవస్తుంది. ‘సరిత’ అంటే నది అని అర్థం – ఆమె జీవితం కూడా అంతులేకుండా సాగుతూనే ఉంటుందని ముగింపునిచ్చారు బాలచందర్.

ఈ సినిమా చూసిన వారు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆదరించారు. ‘అంతులేని కథ’ చిత్రాన్ని రామ్ అరంగణ్ణల్ నిర్మించారు. ఈ చిత్రానికి మాటలు- పాటలు ఆచార్య ఆత్రేయ పలికించారు. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం ఎంతగానో అలరించింది. శతదినోత్సవం జరుపుకుందీ చిత్రం. తరువాత కన్నడలో సుహాసిని ప్రధాన పాత్రలో ఇదే కథ ‘బెంకియల్లి అరళిద హూవు’ పేరుతో రీమేక్ అయింది.

Related posts

ఆన్‌లైన్‌లో మహానాడు: చంద్రబాబు సంచలన నిర్ణయం

Satyam News

అది దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య వివాదం

Satyam News

దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి అనిత

Satyam News

యుద్ధ నేపథ్యంలోనూ వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ

Satyam News

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News

మీ సేవ కేంద్రాలతో అత్యుత్తమ డిజిటల్ సేవలు

Satyam News

Leave a Comment