ఆధ్యాత్మికంహోమ్

రవీంద్ర భారతిలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి

#Basaveswara

మహాత్మా బసవేశ్వరుని 893వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రవీంద్ర భారతిలో నేడు జరిగిన బసవేశ్వరుని 893వ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో బాటు మంత్రి పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి మహోన్నత విలువలను సమాజానికి అందించిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు. ఆయన బోధించిన “కాయకమే కైలాసం” అనే సూత్రం ప్రతి మనిషి తన శ్రమ ద్వారానే ఎదగాలనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. బసవేశ్వర కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సమాజాన్ని ఒకటిగా చూడాలని పిలుపునిచ్చారు.

స్త్రీ-పురుష సమానత్వానికి ప్రాధాన్యతనిస్తూ, సమాజంలో సమాన అవకాశాల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన వచనాలు నేటికీ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ, సమాజ మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం సమాజంలో ఇంకా కొన్ని అసమానతలు, వివక్షలు కొనసాగుతున్న ఈ సమయంలో బసవేశ్వర ఆశయాలు మరింత ప్రాసంగికంగా మారాయి.

సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వర ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే మా లక్ష్యం.

బసవేశ్వర బోధనలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, వాటిని మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలి. సమాజంలో మంచి మార్పుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. చివరగా, బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను మనస్ఫూర్తిగా ఆచరిద్దాం. సమానత్వ సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా కృషి చేద్దాం అని అన్నారు.

Related posts

అద్భుతమైన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ

Satyam News

కేంద్రం చేతిలో కీలుబొమ్మ ఈ గవర్నర్

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

Satyam News

ట్రంప్ డ్రామాలతో యూరప్ కు జెంప్

Satyam News

సర్పంచ్ లకు గుడ్ న్యూస్

Satyam News

Leave a Comment