సంపాదకీయంహోమ్

ఏపీలో ప్రకృతి బజార్‌లు…. ఆర్గానిక్‌ పంటలతో వంటలు

#CBNProfile

ప్రపంచం ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తున్నా.. జనాలు పాత పద్దతులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పంటలు, వంటల విషయంలో సంప్రదాయ విధానాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు, సంప్రదాయ వంటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సేవ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు విజయ్‌రామ్‌. మన భూమి, మన పంట, మన వంటకు చేయూత ఇవ్వాలని.. రైతు సొసైటీలకు ఐదెకరాల భూమిని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన సేవ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు.. తెలుగుదనం వేదికలతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా.. రైతు బజార్‌లతో మన వ్యవసాయానికి, శిల్పారామాలతో మన సంస్కృతికి చంద్రబాబు చేయూత అందించారని గుర్తు చేశారు. తెలుగుదనం పేరుతో 600 రకాల ఆంధ్రా వంటకాలను పరిచయం చేసి.. అమ్మమ్మ, నానమ్మల చేతి వంటలను రుచి చూపిస్తామని చెప్పారు.

ఈ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రెండేళ్లలో నిర్వహించిన భోజన పండుగలకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 5 వరకు నిర్వహించిన సబల కార్యక్రమానికి 50 వేల మంది వచ్చారు. ప్రజలు మన వంటలను ఆస్వాదిస్తున్నారని చెప్పడానికే ఇదే ప్రత్యక్ష నిదర్శనం. తెలుగుదనం వేదికల ద్వారా ఏ కాలంలో ఏం తినాలి.. మిఠాయిలు, పచ్చళ్లు, గానుగ నూనెల తయారీ, మట్టి బొమ్మలు.. కుండలు చేయడం, బుట్టలు.. తాటి మంచాల అల్లికపై శిక్షణ ఇస్తారు.

గో ఆధారిత వ్యవసాయం, వాన నీటి సంరక్షణ, దేశీయ విత్తనాలు, దేశీ ఆవుల పెంపకం, పాడి పరిశ్రమల్లో పని చేయడానికి అవసరమైన వివరాలు తెలియజేస్తారు. రైతు బజార్‌లు వ్యవసాయానికి ఊతమిస్తే.. తెలుగుదనం పేరుతో ఏర్పాటు చేసే ప్రకృతి బజార్‌ ఆరోగ్యకరమైన పంటలు, వంటలను ప్రజలకు చేరువ చేస్తాయని సేవ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. త్వరలోనే ప్రకృతి బజార్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Related posts

CBN Target: 2036 ఒలింపిక్స్‌కు వేదికగా అమరావతి

Satyam News

దర్శకుడు పీసీ ఆదిత్య కు గౌరవ డాక్టరేట్

Satyam News

ఏపిలో ఐఏఎస్ లకు పోస్టింగ్ లు

Satyam News

కృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు

Satyam News

పులివెందులలో మంగళగిరి మాస్‌ జాతర..!

Satyam News

ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం

Satyam News

Leave a Comment