ఆధ్యాత్మికంహోమ్

సింహ వాహనంపై యోగ నరసింహ అలంకారంలో శ్రీ మలయప్ప

#SriMalayappaSwamy

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహనసేవ అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగింది.

సింహ వాహనం – ధైర్యసిద్ధికి ప్రతీక

దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు. సింహం పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యం, మహాశక్తికి ప్రతీకగా భావించబడుతుంది.

సింహరూప దర్శనం మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, విజయస్ఫూర్తిని మేల్కొలుపుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. సోమరితనాన్ని వీడి కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగేందుకు సింహ వాహనసేవ స్ఫూర్తినిస్తుంది.

యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు అభయం, ధైర్యం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే మహోన్నత అనుభూతిని కలిగించింది.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులు వర్షాలు

Satyam News

శ్రీనగర్ – లడఖ్ మధ్య రవాణా కష్టాలకు చెక్

Satyam News

వైభవంగా “బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డ్స్ ప్రదానోత్సవం

Satyam News

ఎర్రబస్సు రాని ఊరికి.. ఎయిర్‌ బస్ ఎలా వచ్చింది?

Satyam News

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Satyam News

Leave a Comment