సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ వెడ్డింగ్ జరిగిందంటే చాలు.. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలవుతాయి. పెళ్లి వేడుకల సందడి సంగతి పక్కన పెడితే.. సెలబ్రిటీల గతం గురించి మాత్రం నెటిజన్లు బాగానే ఆరా తీస్తుంటారు. లేటెస్ట్‌గా పెళ్లి బంధంతో ఒక్కటైన సమంత, రాజ్ నిడిమోరు జంట విషయంలోనూ సోషల్ మీడియాలో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. వీళ్ల డేటింగ్, పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అయింది.
డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్ నిడిమోరు అత్యంత సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి మీడియా హంగామా లేకుండా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో, కేవలం 30 మంది అతిథులతో మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది.
సమంత రెండో పెళ్లి చేసుకొని హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఈ సమయంలో ఆమె శృంగారంపై చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె ఒక సందర్భంలో “ఫుడ్ లేకుండా అయినా ఉండగలను కానీ శృంగారం లేకుండా ఉండలేను” అన్నారు.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఇటీవల సమంత రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్ ట్రెండ్ అవుతోంది. సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొన్ని నెలల పాటు డేటింగ్ చేసి డిసెంబర్ 1న పెళ్లి చేసుకుంది . ప్రస్తుతం ఈ ఇద్దరూ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో శృంగారంపై సమంత చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంత చేసిన కామెంట్స్‌ను మళ్ళీ వైరల్ చేస్తున్నారు కొందరు. ఆహారం, శృంగారం గురించి మీ అభిప్రాయం ఏంటని ఓ యాంకర్ సమంతను అడగ్గా.. ‘ఫుడ్ లేకుండా అయినా ఉండగలను కానీ శృంగారం లేకుండా ఉండలేను’ అని డేరింగ్ గా చెప్పేసింది.
దీంతో ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకొని హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న వేళ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజ్ నిడిమోరు గతంలో రైటర్, హీలర్ అయిన శ్యామలీ డేను 2015లో వివాహం చేసుకోగా.. 2022లో వారు విడిపోయినట్లు సమాచారం. అటు సమంత కూడా గతంలో నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ది ఫ్యామిలీ మ్యాన్ 2′, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి భారీ ప్రాజెక్టుల్లో సమంత, రాజ్ కలిసి పనిచేశారు. 2025 స్టార్టింగ్‌లో వీరి బంధం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. సమంత కెరీర్ విషయానికొస్తే.. ఇటీవలే ‘సిటాడెల్: హనీ బన్నీ’తో అలరించిన సమంత చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె స్వయంగా నిర్మిస్తూ, లీడ్ రోల్ ప్లే చేస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే భారీ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ సామ్ ఫుల్ బిజీగా ఉంది.
