26.7 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

కోవర్టు ఆపరేషన్లతో రేవంత్ కు పరేషాన్

#QuestionMark

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఎలాంటి ఢోకా లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. అంతే కాదు ప్రభుత్వంలో అత్యంత కీలక నిర్ణయాలు ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయి. చాలా రోజుల నుంచి ప్రభుత్వ పెద్దలకు ఈ అంశంపై ఎన్నో అనుమానాలు ఉన్నా ఎక్కడ నుంచి సమాచారం లీక్ అవుతున్నది అనే విషయంపై స్పష్టత రాలేదు.

ఎవరైనా మంత్రులే ఇలాంటి పని చేస్తున్నారా? లేక గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రుల దగ్గర పని చేసి ఇప్పుడు మళ్లీ మంత్రుల వద్దకు చేరిన వారు లీక్ చేస్తున్నారా అనే విషయం కూడా ఎవరికి అర్ధం కాలేదు. హిల్ట్ పాలసీ గురించి పూర్తి స్థాయిలో కేబినెట్‌కు కూడా వివరాలు తెలియక ముందే బీఆర్ఎస్‌కు తెలిసిపోవడంతో కోవర్ట్ చాలా ఉన్నత స్థాయిలోనే ఉన్నారనే క్లారిటీ వచ్చింది.

దాంతో ఈ అంశంపై విజిలెన్స్ దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదిక సీఎం వద్దకు చేరింది. దాంతో అసలు కోవర్ట్ ఎవరో కాంగ్రెస్ పెద్దలకు తెలిసిపోయిందని చెబుతున్నారు. ఆయనను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా ఉన్న ఆయన సిన్సియారిటీని సీఎం రేవంత్ రెడ్డి బాగా నమ్మారు.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి జిల్లా నుంచి వచ్చిన ఆయనకు నామినేటెడ్ పదవిని చాలా ముందుగానే ప్రకటించారు. సీఎంతో నిత్యం సమావేశాల్లో పాల్గొనేంత కీలక పదవి ఇచ్చారు. తర్వాత రాజ్యాంగబద్దమైన పదవి ఇచ్చారు. పదవి ఏదైనా తనకు ఉన్న చనువుతో కీలక విషయాలను తెలుసుకునేవారు.

వాటిని గుట్టుచప్పుడు కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు పంపుతున్నారు. హిల్ట్ పాలసీ కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇలా ఫార్వార్డ్ అయ్యాయని చెబుతున్నారు. కేటీఆర్ వాటిని చూపించి ముందే ప్రెస్ మీట్ పెట్టారు. అయితే రేవంత్ చాలా నమ్మకం పెట్టుకున్న ఆయన ఇలా బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు కుమ్మక్కయ్యారని, రేవంత్ కు ఎందుకు ద్రోహం చేశారన్నది హైలెవల్‌లో జరుగుతున్న చర్చ.

దీనికి కూడా కారణాలు ఉన్నాయని అంటున్నారు. డబ్బుతో పాటు హనీట్రాప్ బారిన ఆయన పడ్డారని కూడా అంటున్నారు. అయితే బ్లాక్ మెయిల్ కారణంగానే ఇలా కోవర్టుగా మారారని మరి కొందరు అంటున్నారు.

Related posts

ఘనంగా వట్పల్లి హజ్రత్ దర్గా షరీఫ్ ఆరాధన

Satyam News

ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ మార్గదర్శకాలు

Satyam News

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్

Satyam News

నర్సింగ్ డైరెక్టరేట్ లో క్లినికల్ నర్సింగ్ కు ప్రాతినిధ్యం కల్పించాలి

Satyam News

నారా లోకేష్ ప్రత్యేకత…. పాజిటివ్ పాలిటిక్స్!

Satyam News

ములకలచెరువు ‘దొంగలు’ దొరుకుతారా?

Satyam News

Leave a Comment