26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ కంచి కామకోటి పీఠం విద్యాసంస్థల అడ్మిషన్లు ప్రారంభం

#SriKanchiKamakoti

శ్రీ కంచి కామకోటి పీఠం శంకరాచార్య స్వాముల వారిచే స్థాపించబడి, 33 సంవత్సరాలకు పైగా విజయవంతంగా నిర్వహించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం (డీమ్డ్ టు బి యూనివర్సిటీ), కాంచీపురం (కంచి యూనివర్సిటీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్‌మెంట్, లా, అలైడ్ హెల్త్ సైన్సెస్ (AHS), సంస్కృతం, బి.ఎడ్. మరియు ఇతర యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాలు ప్రారంభమైనవి.

తల్లిదండ్రులు మరియు విద్యార్థుల విజ్ఞప్తి మేరకు 2026 జూన్ 9వ తేదీ,   మంగళవారం,  సాయంకాల  సమయం 5 గంటల  నుండి  ,  రాత్రి 8 గంటల  వరకు విజయవాడ నగరం లోని శ్రీ కంచి కామకోటి పీఠం  శ్రీ వేంకటేశ్వర స్వామి – శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి వార్ల దేవస్థానము, వేంకటేశ్వరపురము , లబ్బిపేట విజయవాడ-10.  లో  స్పాట్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ Vice Chancellor Prof. G. Srinivasu garu, Dean (Science) Prof. K. Venkata Ramana garu మరియు కంచి కామకోటి శంకరమఠం ప్రతినిధులు పాల్గొని విశ్వవిద్యాలయం, కోర్సులు, ప్రవేశ విధానం మరియు ఉపాధి అవకాశాల గురించి వివరాలను తెలియజేస్తారు.

ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్‌షిప్ పద్ధతిలో ప్రవేశాలు కల్పించబడుతున్నాయి. విద్యార్థులకు శాకాహార భోజనం, జిమ్, ఆధునిక క్రీడా మైదానాలు, ఉత్తమ వసతి సౌకర్యాలు మరియు ఆకర్షణీయమైన ప్లేస్‌మెంట్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కంచి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులలో 70 శాతానికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. అర్హత మరియు ఆసక్తి కలిగిన విద్యార్థులకు తక్షణ స్పాట్ అడ్మిషన్లు కూడా కల్పించబడతాయి.

సదరు సమావేశానికి హాజరు కాలేని వారు యూనివర్సిటీ వెబ్‌సైట్: www.kanchiuniv.ac.in ను సందర్శించవచ్చు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9885122101 విజ‌య‌వాడ, 85007 37858, విజయవాడ, యూనివర్సిటీ కార్యాలయం: 9629001144. ఆయుర్వేద కోర్సుల వివరాలకు: 8098001630, మరిన్ని వివరాల కోసం: 9398320630, 9441687770 సంప్రదించవచ్చు. అందరు విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరడమైనది.

Related posts

మోసం చేసిన వైసీపీ నేత ఇల్లు ముట్టడి

Satyam News

రవీంద్ర భారతిలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి

Satyam News

ఎసిబి వలలో వనపర్తి జిల్లా సివిల్ సప్లయి డి.ఎం

Satyam News

సీఎం చంద్రబాబును కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Satyam News

టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ

Satyam News

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

Leave a Comment