రంగారెడ్డిహోమ్

వికారాబాద్ లో ఘనంగా పర్యావరణ దినోత్సవం

#Vikarabad

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వికారాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2026 ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో ప్రధాన జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఎం. నాగరాజు , Iవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి పి. ప్రదీప్ నాయక్ , సీనియర్ సివిల్ జడ్జి ఎం. వెంకటేశ్వర్లు , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్. శాంతిలత , అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి సభాపతి , వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి. లవకుమార్ , ప్రధాన కార్యదర్శి పి. వెంకట్ రెడ్డి మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు మరియు అటవీ శాఖ అధికారులు వివిధ జాతులకు చెందిన మొక్కలను నాటారు. అనంతరం వృక్షాల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యత పరిరక్షణలో చెట్ల పాత్ర, వాతావరణ మార్పుల నివారణలో చెట్ల అవసరాన్ని వివరించారు.

చెట్లు మానవాళికి ప్రాణవాయువు, ఆహారం మరియు ఆశ్రయాన్ని అందించే అమూల్యమైన ప్రకృతి సంపద అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అటవీ శాఖ తరఫున కె. శ్యామ్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్,  వికారాబాద్, జి. ప్రతిమ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, పర్గి, విజయ్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కొడంగల్, పి. నాగేశ్వరరావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, వికారాబాద్‌తో పాటు వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం

Satyam News

ఒత్తిడికి లొంగిపోయిన కేంద్ర ఎన్నికల సంఘం

Satyam News

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌… ఢిల్లీలో మంత్రి నారా లోకేష్‌

Satyam News

అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి

Satyam News

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

Leave a Comment