మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో జిల్లా ఎస్పీ సునితకు స్వాగతం

#WanaparthyPolice

వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా  డి. సునిత అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం ముందుగా వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో   వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు  పూల మొక్క అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం నూతన ఎస్పీ  పోలీసుల గౌరవ వందనం స్వీకరించి. కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను  స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ   మాట్లాడుతూ వనపర్తి   జిల్లాలో ప్రజలకు మరింత చేరువగా ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని తెలిపారు.  చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, అసాంఘిక ప్రవర్తనపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వనపర్తి ప్రజల గౌరవం, భద్రత, ప్రశాంతత మొదటి ప్రాధాన్యం. మహిళలు, పిల్లలు భయం లేకుండా జీవించే వాతావరణం కల్పించడం పోలీసు శాఖ బాధ్యత. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు.

ఆన్లైన్ బెట్టింగ్‌ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ  తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని చెప్పారు. జిల్లాలోని పోలీసు అధికారులు నూతన ఎస్పీకి అపోలో మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

RPL సీజన్-1 విజేతగా చీపురుపల్లి జట్టు

Satyam News

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ….??

Satyam News

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి

Satyam News

పేరుకే ఆసుపత్రి… వైద్యుడు ఉండడు

Satyam News

యుఏఈ తో భారత్ కీలక ఇంధన ఒప్పందం

Satyam News

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

Leave a Comment