భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి జరిగింది. అక్కడి కార్యదర్శి, సర్పంచ్ కుమ్మకై కోట్లలో నిధులు స్వాహా చేశారు. నకిలీ బిల్లులతో నకిలీ షెల్ కంపెనీలను సృష్టించి ఆ కంపెనిల ద్వారా పంచాయతీ సామానులు కొనుగోలు చేసినట్టు చూపి ఆ షెల్ కంపెని యజమానులతో ఒప్పందాలు చేసుకుని పంచాయతీ నిధులు కోట్లలో స్వాహా చేశారు. ఆ నిధులను తిరిగి నకిలీ కంపెల యజమానుల ఎక్కౌంట్ల నుండి కార్యదర్శి వ్యక్తిగత లేదా బినామీ ఎక్కౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకుని పంచాయతీలలో కోటానుకోట్ల నిధులను నిలువునా లూటీ చేశారు.
ఈ విషయం విచారణలో తెలడం తో జిల్లా అధికారులు కార్య దర్శికి సర్పంచ్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ కార్యదర్శి విధులు నిర్వహించిన ప్రతి పంచాయతీ లో నిధులు లూటీ చేయడం లో ఘనాపాటి అని కొంత మంది పంచాయతీ అధికారులే చెప్పుకుంటున్నారు. ఇలా దోపిడీ చేసిన నిధులలలో కొంత సొమ్మును విచారణాధికాసురులకు ముట్ట జెప్పి విచారణ నుండి తప్పించుకోవడం కూడా ఆయనకు తెలుసు.
ఈ సారి మాత్రం సుమారు 2 కోట్లు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన కార్యదర్శికి, సర్పంచ్ కు కలెక్టర్ తాఖీదులు జారీ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మరియు ఏలూరు చరిత్రలో ఈ స్తాయిలో భారీ నిధుల స్వాహా జరగడం ఇదే ప్రప్రథమం. భీమడోలు పంచాయతీ నిధులు దుర్వినియోగం వాస్తవమని తెలిసినా పంచాయతీ అధికారుల సహకారంతో విచారణ ముందుకు సాగడం లేదు.
పంచాయతీ రాజ్ కమీషనర్ కృష్ణతేజ చొరవతో నిధులు స్వాహాపై ఫైల్ కదిలింది. పంచాయతీ నిధులు స్వాహాపై సెక్రటరీ తనూజకు, సర్పంచ్ కు వివరణ కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నోటీసులు జారీ చేశారు. భాద్యులపై క్రిమినల్ కేసు పెట్టి నిధులు రికవరీ చెయ్యాలని ఫిర్యాదు దారుడు చంద్రమౌళి డిమాండ్ చేశారు.
త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని బాధితులు కలవనున్నారు. నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదుదారుడు చంద్రమౌళి ఇచ్చిన పి.జీ.ఆర్.ఎస్ దరఖాస్తు మేరకు కలెక్టర్ ఆదేశాలుతో విచారణ చేపట్టిన ఏలూరు డి.ఎల్.పి.ఓ అమ్మాజీ. సెక్రటరీ కెవిఎల్ తనూజాను, సర్పంచ్ ను భాద్యత చేస్తూ కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు.
గతంలో కూడా ఏలూరు రూరల్ మండలం శనివారపేట పంచాయతీలో పారిశుధ్య కార్మికుల నిధులు స్వాహా చేసినందుకు సెక్రటరీ కె.వి.ఎల్ తనూజాను సస్పెండ్ చేశారు. పంచాయతీ నుంచి ఏ అనుమతి కావాలన్నా సెక్రటరీ తనూజాకు లంచం ఇవ్వాల్సిందే. ప్రధానంగా లేఔట్, ఇంటి కుళాయిలు అనుమతులు, ఇంటి ప్లాన్స్ అనుమతులు, ఇంటి, కొళాయి పన్నులు, పంచాయతీ సాధారణ నిధులు వినియోగం, ఆర్ధిక సంఘం నిధులు, మార్కెట్ పాటలు, బ్లీచింగ్, శానిటేషన్ మెటీరియల్స్ కొనుగోలు, ఇతర ఖర్చులు ఇలా గ్రామ పంచాయతీకి సంబంధించి జరిగిన ప్రతి ఖర్చులపై అవినీతి ఉన్నది.
సెక్రటరీ తనూజా భీమడోలుతో పాటు గుండగొలను పంచాయతీకి ఇంచార్జి సెక్రటరీగా ఉండి లక్షలలో నిధులు స్వాహా చేసినట్టు పంచాయతీ అధికారులు గుర్తించారు. జిల్లా పంచాయతీ కార్యాలయం, ఏలూరు డిఎల్పిఓ కార్యాలయంలో ఉన్న కొందరు సిబ్బంది సహకారంతో సెక్రటరీ తనూజా అవినీతి దందా జరిగిందని విశ్వాసనీయ సమాచారం. నిధులు స్వాహా విషయంలో విచారణ ఆలస్యం అవ్వడానికి ఇదే ప్రధాన కారణం కూడా. డీపీఓ, డి.ఎల్.పి.ఓ, ఎంపీడీఓ, పంచాయతీ రాజ్ అధికారులు తనిఖీలు లేకపోవడం వల్లే గ్రామ పంచాయతీలలో భారీస్థాయిలో నిధులు గోల్ మాల్ జరుగున్నాయి.
