ప్రపంచంహోమ్

అమెరికాపై కుట్ర చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలి

#Trump

వాషింగ్టన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ అణు పదార్థాలతో కూడిన రేడియోలాజికల్‌ బాంబు (డర్టీ బాంబు) ప్రయోగానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై దాడికి ఇరాన్‌ కుట్ర పన్నుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు.

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్  ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా రాజధానిపై దాడి ముప్పు ఉందా అని ప్రశ్నించగా, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ అలాంటి దాడి జరిగితే ఇరాన్‌ ఎన్నడూ చూడని స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే తక్షణమే దాడి జరిగే అవకాశం ఉందని భావించడానికి కారణం ఉందా అని అడిగినప్పుడు, అలాంటి పరిస్థితి ఉండకూడదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

వాషింగ్టన్‌లో డర్టీ బాంబు పేల్చేందుకు ఇరాన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఒక వార్తా సంస్థ పేర్కొంది. సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక పదార్థాలను జోడించి తయారు చేసేదే డర్టీ బాంబు. ఇది అణుబాంబు మాదిరిగా అణు విస్ఫోటనం సృష్టించకపోయినా, పరిసర ప్రాంతాల్లో రేడియోధార్మిక కాలుష్యాన్ని వ్యాప్తి చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగించగలదు.

అమెరికా నిఘా వర్గాల ఆరోపణలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్‌పై డర్టీ బాంబు దాడికి ప్రణాళిక సిద్ధం చేస్తోందన్న వార్తలు నిరాధారమైనవని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఈ పరిణామాలతో అమెరికా, ఇరాన్‌ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.

Related posts

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Satyam News

టెహ్రాన్ కు చేరిన రష్యా కార్గో విమానం

Satyam News

అలీ లారిజానీ అంతిమ యాత్రలో కోట్లాది మంది….

Satyam News

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

Satyam News

ఆర్ధిక నేరంలో అందమైన భామల విచారణ లేదు…

Satyam News

Leave a Comment