26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

#UstadBhagatSingh

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఉత్కంఠభరితమైన షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. పవర్‌స్టార్ అభిమానులకు పండుగ లాంటి ఈ సినిమా అన్ని వయసుల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్‌లేంగే సాలా’ పాటలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కు అచ్చమైన ఫ్యాన్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, గతంలో ‘గబ్బర్ సింగ్’తో సృష్టించిన మ్యాజిక్‌ను మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు.

కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివచ్చేలా పవర్‌ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ చిత్రం అందించనుంది. మార్చి 26ని క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి… పవర్‌స్టార్ సంబరాలకు సిద్ధంగా ఉండండి!

నటీనటులు (Cast):

పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, ఆర్. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్‌బీ శ్రీరామ్, రావు రమేష్, రమ్కీ, KGF అవినాష్ తదితరులు

సాంకేతిక బృందం:

కథ – దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, స్క్రీన్‌ప్లే: కె. దశరథ్, రమేష్ రెడ్డి, అదనపు రచన: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి, CEO: చెర్రీ, ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్,క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై, PRO: లక్ష్మీ వేణుగోపాల్, మార్కెటింగ్: ఫస్ట్ షో

Related posts

వారంలో పాస్ బుక్‌లు..రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్

Satyam News

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

Satyam News

పోలవరం పూర్తికి సహకరించండి: చంద్రబాబు

Satyam News

సొంత నియోజకవర్గంలో కేటీఆర్ కు అవమానం

Satyam News

టెన్త్‌లో ఫ‌లించిన వంద‌రోజుల ప్ర‌ణాళిక‌

Satyam News

వైఎస్ గుట్టు బయటపెట్టిన వైసీపీ ప్రధాన కార్యదర్శి

Satyam News

Leave a Comment