జాతీయంహోమ్

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్‌ ప్రత్యేకత ఇదీ

AquaCulture

ఒడిశా పర్యటనలో ఉన్న పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నేతృత్వంలోని తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం మూడో రోజున భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్‌ను (సీఐఎఫ్ఏ) సందర్శించింది. మీడియా బృందానికి సీఐఎఫ్ఏ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ సాహు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన సంస్థ లక్ష్యాలు, ప్రధాన పరిశోధనలు, దేశంలో మంచినీటి చేపల పెంపక రంగ అభివృద్ధిలో సంస్థ పోషిస్తున్న కీలక పాత్ర గురించి వివరించారు. ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు వ్యాధి నిరోధక శక్తి కలిగిన చేపల పెంపకం, జన్యుపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, సుస్థిర ఆక్వాకల్చర్ పద్ధతుల్లో వస్తున్న పురోగతి గురించి పలు విషయాలను పంచుకున్నారు.

దీని తర్వాత క్షేత్రస్థాయి సందర్శన చేపట్టిన మీడియా ప్రతినిధులు చేపల పునరుత్పత్తి, పెంపకానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. సంస్థలోని బయోఫ్లోక్ యూనిట్, అలంకార చేపల హ్యాచరీ సముదాయం, గాలిని పీల్చుకునే చేపల హ్యాచరీ సముదాయం వంటి పలు విభాగాలను సందర్శించింది.

ఆధునిక హ్యాచరీ నిర్వహణ పద్ధతులు, తక్కువ నీటి వినియోగంతో కూడిన ఆక్వాకల్చర్ వ్యవస్థలు, ఉపాధి ఆధారిత సాంకేతికతలను శాస్త్రవేత్తలు వివరించారు. బయోఫ్లోక్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన శాస్త్రవేత్తలు.. చేపల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, దాణా ఖర్చును తగ్గించడం, రైతులకు ఉత్పాదకతను పెంచడంలో ఇది ఎలా తోడ్పడుతుందో వివరించారు.

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) ఆధ్వర్యంలో సీఐఎఫ్ఏ పనిచేస్తోంది. సామర్థ్య పెంపు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా సుస్థిరమైన ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సంస్థ, రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు దేశ ఆహార భద్రత విషయంలో విశేష కృషి చేస్తోంది.

‘సీఐఎఫ్ఏ’కు చెందిన ఎఫ్‌జీబీ విభాగాధిపతి డాక్టర్ జే. కే. సుందరాయ్, ఏపీఈ విభాగాధిపతి డాక్టర్ పీ.సీ. దాస్  సమన్వయంతో ఈ సందర్శన విజయవంతమైంది. సీఐఎఫ్ఏ శాస్త్రవేత్తల కృషిని మీడియా ప్రతినిధులు అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు పరిశోధనా సంస్థలకూ, ప్రజలకు మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంలో సహాయపడతాయని వారు పేర్కొన్నారు.

Related posts

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తోనే సమగ్ర క్రీడాభివృద్ధి

Satyam News

ప్రపంచ సినిమా పండుగలో వంతుకు అవార్డులు

Satyam News

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్

Satyam News

పవన్ క్రియేటీవ్ వర్క్స్ మరో ప్రాజెక్టులో బిజీ

Satyam News

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

Satyam News

60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు చికిత్సపై 75% తగ్గింపు

Satyam News

Leave a Comment