26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

ఇక నుంచి రెగ్యులర్గా వస్తా.ఊరికి చేసేది చాలా ఉంది

పెళ్లి చేసుకున్న తర్వాత.. కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరికి వెళ్లిన విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట వీరి సొంత గ్రామం.

గృహ ప్రవేశం తర్వాత సత్యనారాయణ వ్రతం తర్వాత..భార్య రష్మిక మంధానతో కలిసి ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో మాట్లాడారు.సొంత ఊరికి ఇక నుంచి రెగ్యులర్ గా వస్తా.ఊరికి చేసేది చాలా ఉందంటూ విజయ్ మాట్లాడుతుంటే ఫ్యాన్స్ కేరింతలతో మారుమోగి పోయింది.సొంతూరు తుమ్మన్ పేటతో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది.

నా ఫస్ట్ బర్త్ డే ఇక్కడే జరిగింది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు షిష్ట్ అయ్యింది.నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది.

ఊరిలో ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది.. అంటూ అభిమానులను ఉర్రూతలూగించాడు విజయ్.ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్ గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోనే అందరి సమక్షంలో చేస్తాం.

ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ, 10 వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందిస్తాం.. హామీ ఇచ్చాడు విజయ్.

Related posts

బంగ్లాదేశ్ లో హిందువు హత్యపై ఢిల్లీలో నిరసన

Satyam News

లడఖ్ లో మళ్లీ హింస: నలుగురు మృతి

Satyam News

పెరిగిపోతున్న షుగర్ డాడీ కల్చర్

Satyam News

ఈ చేతి వాచ్ ఖరీదు రూ.13.7 కోట్లు…..!

Satyam News

ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ: దారుణ హత్య

Satyam News

జన నాయగన్ నా ఆఖరి చిత్రం

Satyam News

Leave a Comment