హైదరాబాద్హోమ్

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

#Revanthreddy

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల కోసం పార్టీ నిర్వహించిన ఒక రహస్య సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గ్రేటర్ పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో దాదాపు 200 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నట్లు ఈ సర్వే నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికలతో పాటు గ్రేటర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది.

అయినప్పటికీ, రాబోయే ఎన్నికల్లో మూడు మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే గ్రేటర్ ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని మెరుగుపరుచుకున్న తర్వాతే ఓట్ల వేటకు వెళ్లాలని అధిష్టానం భావిస్తోంది.

ప్రధానంగా గతంలో పార్టీని వీడి వెళ్లిన బలమైన నేతలను తిరిగి సొంత గూటికి చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వారిని బుజ్జగించి మళ్లీ పార్టీలోకి తీసుకురావడం ద్వారా కేడర్‌లో ఉత్సాహం నింపాలని, తద్వారా గ్రేటర్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని పార్టీ యోచిస్తోంది. ఈ వ్యూహాలన్నీ సత్ఫలితాలనిస్తేనే మేయర్ పీఠాలపై కాంగ్రెస్ ఆశలు నెరవేరే అవకాశం ఉంది.

Related posts

మెగాస్టార్ కు తొలి పత్రిక ఇచ్చిన అల్లు శిరీష్

Satyam News

మోసం చేసిన వైసీపీ నేత ఇల్లు ముట్టడి

Satyam News

కొత్త స్టోరీ: ఇరాన్ అమెరికా చర్చలు మళ్లీ మొదలు?

Satyam News

ఇండక్షన్ స్టౌ లకు పెరిగిన డిమాండ్

Satyam News

శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక మాసం వనభోజనాలు

Satyam News

ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మిండన్ లీగ్

Satyam News

Leave a Comment