సంపాదకీయంహోమ్

జగన్ వెయ్యి కోట్ల బంటు కోసం….. షర్మిల బలి.!

#JaganPA

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి PA, అత్యంత సన్నిహితుడైన కె. నాగేశ్వర్ రెడ్డి (KNR) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. KNR వేల కోట్ల అక్రమ సంపాదన వ్యవహారంపై ABNలో వచ్చిన సంచలన కథనం వైసీపీ వర్గాల్లో వణుకు పుట్టించింది.

అయితే, తన PA చుట్టూ అలుముకున్న ఈ భారీ అవినీతి మంటల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే..జగన్ తన సొంత మీడియా సాక్షి ద్వారా చెల్లెలు వైఎస్ షర్మిల అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా చక్రం తిప్పిన KNR.. విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో షెల్ కంపెనీలు, బినామీల పేరిట వందల, వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. SIT దర్యాప్తులో విశాఖలో రూ. 250 కోట్ల భూమి, రియల్టర్ల బెదిరింపులు, భార్య పేరుతో వందల ఎకరాల కొనుగోళ్లు వంటి విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

అంతేకాకుండా, త్వరలోనే ED రంగంలోకి దిగుతుందనే సంకేతాలు రావడంతో KNR అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఒకప్పుడు జగన్‌కు నీడలా ఉన్న KNR బండారం బయటపడి, పార్టీ పరువు గంగలో కలిగే పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితుల్లో PA అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చి, ప్రజల ఫోకస్‌ను మళ్లించడానికి జగన్‌కు బలమైన అస్త్రం అవసరమైంది. సరిగ్గా అప్పుడే వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన అంశాన్ని సాక్షి పత్రిక ఎంచుకుంది.

దీన్ని ఒక పెద్ద రాజకీయంలా చిత్రీకరిస్తూ, చెట్టాపట్టాల్ అంటూ సాక్షిలో విషం చిమ్మే కథనాలు రాయించారు. సొంత చెల్లెలనే టార్గెట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని, మీడియా చర్చలను KNR భూ కుంభకోణాల నుంచి షర్మిల వివాదం వైపు మళ్లించాలనేది పక్కా ప్లాన్.

తన అక్రమాలను మోసే నమ్మకస్తుడైన PAను కాపాడుకోవడానికి, అవసరమైతే సొంత చెల్లెలు షర్మిలను కూడా రాజకీయ కక్షసాధింపులకు బలి చేసేందుకు జగన్ వెనుకాడటం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. KNR అక్రమాలపై ABN ఇచ్చిన గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ తెచ్చిన దుమారాన్ని తట్టుకోలేకనే..సాక్షి పత్రిక ద్వారా ఈ డైవర్షన్ డ్రామాకు తెరతీశారని స్పష్టమవుతోంది.

ఏదేమైనా, వేల కోట్ల అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుటుంబ సంబంధాలను సైతం రాజకీయ లబ్ధికి వాడేస్తున్న జగన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్: 6 గురు హతం

Satyam News

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Satyam News

గణతంత్ర పెరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’

Satyam News

భార్యపై భర్త అమానుష దాడి

Satyam News

యూట్యూబర్ నాన్సీ హత్యకు అసలు కారణం ఏమిటి?

Satyam News

రష్యాపై భారీ దాడి చేసిన ఉక్రెయిన్

Satyam News

Leave a Comment