ప్రపంచంహోమ్

మా మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు: డొనాల్డ్ ట్రంప్

#DonaldTrump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాతో స్నేహ హస్తం చాచారు. అంతే కాకుండా తమ మధ్య భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తవని స్పష్టం చేశారు. చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న 33వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ) దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గురువారం ట్రంప్‌, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ మీతో సమావేశం కావడం గౌరవంగా భావిస్తున్నానని, మీరు నా స్నేహితుడని అన్నారు. మన మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉందని, మనిద్దరం బాధ్యతల్లో ఉన్నంతకాలం ఎలాంటి సమస్యలు ఉండబోవని వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ సమస్యలు, ప్రపంచ శాంతి వంటి అంశాల్లో అమెరికా, చైనా కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు చేయగలిగిన పనులను ప్రపంచంలోని మరే ఇతర దేశాలు చేయలేవని అన్నారు.

ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరిచేందుకు గణనీయమైన పురోగతి సాధించామని ట్రంప్ తెలిపారు. చైనాతో వాణిజ్య సంబంధాల్లో ఉన్న అసమతుల్యతను సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మే నెలలో తాను బీజింగ్‌లో పర్యటించిన సందర్భంగా వాణిజ్య మండలిని ఏర్పాటు చేశామని, దీని ద్వారా గతంలో ఒకవైపుగా ఉన్న వాణిజ్య సంబంధాల్లో సమతుల్యత తీసుకురావడానికి ప్రయత్నించామని వివరించారు.

హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా కొనసాగడం అమెరికా, చైనా రెండు దేశాలకు ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రెండు అంశాలపై ఇరు దేశాలకు ఒకే విధమైన ఆసక్తి, అభిప్రాయం ఉన్నాయని వెల్లడించారు.

అదే విధంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు కృషి చేయడంలోనూ అమెరికా, చైనా ఆసక్తిగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఈ యుద్ధంలో ప్రతి నెలా సుమారు 25 వేల మంది మరణిస్తున్నారని, వారిలో ఎక్కువమంది సైనికులేనని ఆయన పేర్కొన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తదుపరి చర్చల్లో పాల్గొంటారని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇప్పటికే పుతిన్‌తో క్లుప్తంగా మాట్లాడి, తదుపరి సమావేశానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను చర్చించినట్లు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా నేతల మధ్య జరగనున్న ఈ త్రైపాక్షిక సమావేశంలో అణ్వాయుధాల నియంత్రణ, ఇరాన్‌తో ముడిపడిన పరిణామాలు, అంతర్జాతీయ వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Related posts

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

Satyam News

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News

అమిత్ షా కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే బహిష్కరిస్తారా?

Satyam News

అమిత్ షా సమాధానం చెప్పాల్సిందే: విపక్షాల పట్టు

Satyam News

పాకిస్తాన్ చొరబాటుదారుడి కాల్చివేత

Satyam News

కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం

Satyam News

Leave a Comment