సినిమాహోమ్

పోస్ట్ ప్రొడక్షన్ లో జరీనా వహాబ్ – బల్‌దేవ్ ఠాకూర్ ‘తు బేఖబర్’

#DhirajAppaji

వెటరన్ నటి జరీనా వహాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సోషల్ డ్రామా చిత్రం ‘తు బేఖబర్’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. భారతీయ సినీ రంగంలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న జరీనా వహాబ్, ఇటీవల ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.

దీపక్ బల్‌దేవ్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ నిర్మిస్తోంది. డి. దినకర్ నాయుడు సహ నిర్మాత. సమకాలీన సామాజిక సమస్యలను స్పృశించే హృద్యమైన కథాంశంతో, ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించే చిత్రంగా ‘తు బేఖబర్’ను మేకర్స్ అభివర్ణిస్తున్నారు.

జరీనా వహాబ్‌తో పాటు మధు నంబియార్, పవన్ కుమార్, హేమ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నారు. జి.ఎల్. బాబు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంజీవ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటీటీ వేదికపై ప్రత్యేక ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్ట్రీమింగ్ తేదీతో పాటు అధికారిక టీజర్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది!!

Related posts

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం: 41 మంది మృతి?

Satyam News

జేపీ నడ్డాకు అస్వస్థత: ఎయిమ్స్‌లో చికిత్స

Satyam News

విశాఖలో మరో పోర్టు.. కొత్త స్టీల్‌ప్లాంట్‌ లోడింగ్‌..!!

Satyam News

అమెరికా డ్రీమ్స్ ఇక వదిలేయండి: మారిన రూల్సు ఇవే

Satyam News

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News

బాధ్యతలు స్వీకరించిన సుమలత

Satyam News

Leave a Comment