క్రీడలుహోమ్

విజయవాడలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ సెలెక్షన్ ట్రయల్స్‌ను విజయవాడలోని విఆర్ సిద్ధార్థ కాలేజీ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇలా అండర్-21 & ఓపెన్ వాలీబాల్ ట్రయల్స్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

WhatsApp Image 2026-08-06 at 19.28.21
Prime Volleyball League Trials conducted at Vijayawada

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ట్రయల్స్‌కు వచ్చిన క్రీడాకారులకు స్వాగతం పలికారు. ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడే అవకాశాన్ని ప్రతి క్రీడాకారుడు అందిపుచ్చుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు టీడీపీ నాయకులు వెంకట, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణ,  బ్లాక్ బాక్స్ వ్యవస్థాపకులు అభిషేక్ రెడ్డి, టెక్నికల్ ఆర్గనైజర్ తులసి రెడ్డి, సిద్ధార్థ కాలేజ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Related posts

సారిక వ‌ద్ద ప‌ది ఎక‌రాల్లో జిల్లా జైలు నిర్మాణం

Satyam News

19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ప్రారంభం

Satyam News

నిమ్స్‌లో వెయ్యి మంది పేషెంట్లకు రొబోటిక్ సర్జరీలు

Satyam News

45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు: చరిత్ర సృష్టించిన నితిన్

Satyam News

IGGAARL ను సందర్శించిన జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్

Satyam News

మేడారం జంపన్నవాగులో జలకళ

Satyam News

Leave a Comment