క్రీడలుహోమ్

నేషనల్స్ కు తెలంగాణ రాష్ట్ర సీనియర్  స్విమ్మింగ్ జట్టు

#SwimmingTeam

తెలంగాణ రాష్ట్ర సీనియర్  స్విమ్మింగ్ జట్టు సీనియర్  నేషనల్స్ పోటీలకు సిద్ధమైంది. సీనియర్ నేషనల్స్ స్విమ్మింగ్ జట్టు ఎంపిక ట్రయల్స్ 2026 మే 24న అంబర్‌పేట్‌ లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌ షిప్  నిర్వహించారు. తెలంగాణ స్విమ్మింగ్ టీం కెప్టెన్ సుహాస్ ప్రీతం మైలారి ని ఎంపిక చేశారు.

రాష్ట్ర స్విమ్మింగ్ జట్టుకు,  మేనేజర్ అండ్ కోచ్ లకు శనివారం  గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో యూనిఫామ్,  టీషీర్ట్స్ కిట్ అందించారు. ఈ ఈవెంట్ కిట్ ని   7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ స్పాన్సర్  చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ  స్విమ్మింగ్ టీ , స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు  పి . చంద్ర శేఖర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి  జి . ఉమేష్ , 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఎండీ ఎల్. ఎం శంకర్ , టీం మేనేజర్ టి.కిరణ్ కుమార్, టీం స్విమ్మింగ్ కోచ్ ఆయుష్ యాదవ్ , విజయ్ సింగ్ పాల్గొన్నారు .

తెలంగాణ స్విమ్మింగ్ టీం 2026 జూన్ 16 నుంచి జూన్ 21 వరకు అహ్మదాబాద్, గుజరాత్  లో ఉన్న అక్వాటిక్ కాంప్లెక్స్ , వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్  ‌లో నిర్వహించనున్న 79వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొంటారు.

Related posts

వీసాల పట్ల అప్రమత్తత అవసరం

Satyam News

జార్ఖండ్ లో ఆగని ‘‘పేపర్ లీక్’’ రచ్చ

Satyam News

యూరియా కట్టలపై ఫేక్ ప్రచారం గుట్టలు

Satyam News

గొడ్డలి పార్టీ వల్ల ఆగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి

Satyam News

రామతీర్థం లో మిథిల మైదానంలో వైభవంగా శ్రీరామ నవమి

Satyam News

రైతులకే మా తొలి ప్రాధాన్యం: నాదెండ్ల మనోహర్

Satyam News

Leave a Comment