సినిమా హోమ్

అఖండ 2 వెయ్యికోట్ల గ్రాస్: పెరిగిపోతున్న పందాలు

#AKHANDA-2

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘‘అఖండ తాండవం’’ పై అభిమానుల అంచనాలు పెరిగిపోయాయి. అఖండ 2 దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల అవుతుండటమే కాకుండా విదేశాల్లో కూడా విపరీతంగా క్రేజ్ పెరగడంతో ఆ చిత్రం గ్రాస్ కలెక్షన్లపై పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లాల్లో భారీ ఎత్తున పందాలు సాగుతున్నాయి.

తొలి వారం వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే విధంగా పందాలు భారీ ఎత్తున సాగుతుండటం బాలకృష్ణ అభిమానుల్లో ఆనందం నింపుతున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న హిందూత్వ, సనాతన ధర్మ ట్రెండ్ అఖండ 2కు కలిసి వస్తుందని బాలయ్య అభిమానులు అంటున్నారు.

అఖండ 2 చిత్రం మొత్తం హిందూత్వం చుట్టూనే తిరుగుతుంది. అఖండలో ధర్మాన్ని కాపాడడానికి అర్ధనారిశ్వర స్వరూపమైన అఘోర (బాలకృష్ణ) ప్రమాదకరమైన విపత్తును నివారించినప్పటికీ, ఆ శక్తుల మూలం పూర్తిగా నశించలేదు. ద్వేషం, అఘోర విద్య, అంధకారాన్ని పూజించే ఒక కొత్త శక్తి మళ్లీ తలెత్తుతుంది.

ఈ సారి శత్రువు మరింత శక్తిమంతుడు, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే ఒక డాన్. దేశవ్యాప్తంగా జరుగుతున్న యజ్ఞాలు, పవిత్ర స్థలాల నాశనం, రహస్య మానవ బలులు…ఈ వార్తలు వెలుగులోకి రావడంతో, మళ్లీఅఖండను పిలవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రమాదంలో పడిన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తిరిగి వచ్చిన అఖండ, ఈ శక్తుల వెనుక ఉన్న మర్మాన్ని బయటకు తీస్తాడు.

“ధర్మాన్ని రక్షించడం మాత్రమే కాదు, ఈసారి దుష్టుల మూలాన్నే నిర్మూలించాలి” అని సంకల్పిస్తాడు. ఈ కథలో పూర్తి స్థాయి ఆధ్యాత్మికత, తాంత్రిక శక్తులు, పునర్జన్మ రహస్యాలు, అఖండ గతానికి సంబంధించిన మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయని టాక్ ఉంది. చివరికి, ధర్మం–అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామంలో అఖండ ఎలా విజయం సాధిస్తాడు?

సమాజాన్ని రక్షించడానికి ఏ త్యాగం చేస్తాడు? అనేది ప్రధాన కథాంశంగా చెబుతున్నారు. ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో చాలా మంది ప్రేక్షకులు సినిమాను “పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్” అంటున్నారు. పాటలు, యాక్షన్, డైలాగ్స్ పై  హైప్ ఉన్నట్లు టాక్ ఉంది.

బాలకృష్ణ పాన్-ఇండియా క్రేజ్ కూడా సినిమా ముందస్తు బిజినెస్, ప్రీ-సేల్ టికెట్-ల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సినప్పటికీ, ప్రసార సంబంధిత “టెక్నికల్ ఇష్యూలు” కారణంగా ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. ఆ వెంటనే కోర్టు ఆర్డర్ వలన విడుదల కూడా వాయిదా పడింది.

ఇందులో భాగంగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టికెట్-బుకింగ్స్, అభిమానుల్లో అంచనాలు ఉన్నా కూడా రిలీజ్ కాని పరిస్థితి కలుగటంతో అభిమానుల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని అడ్డంకులు దాటడంతో చివరికి అఖండ 2 కి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు, మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది.

నందమూరి బాలకృష్ణ తో బాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, సోనూ సూద్, రమ్య కృష్ణ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందని అంటున్నారు.

బాలకృష్ణ తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ భేటీ కావడం తదితర అంశాలు ఈ చిత్రానికి మరింత క్రేజ్ తెచ్చాయి. సినిమాలపట్ల ఎలాంటి ఆసక్తి లేని సీఎం యోగీ అఖండ 2 పై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో హిందీ ప్రాంతాలన్నింటిపైనా పెద్ద ప్రభావం చూపిస్తున్నది. అందుకే అఖండ 2 వెయ్యి కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలు బలపడుతున్నాయి.

Related posts

డిసెంబర్ 1 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Satyam News

తిరుమల దండయాత్ర పై తోక ముడిచిన జగన్ ?

Satyam News

శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌ పూజ హోమ మ‌హోత్స‌వాలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!