26.3 C
Hyderabad
September 27, 2026
పశ్చిమగోదావరిహోమ్

పాత టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

#PuttaMeheshYadav

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు.

సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్ల లోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో ఉత్తీర్ణులు కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఉపాధ్యాయుల్లో అనిచ్చిత వాతావరణం సృష్టించిందన్నారు. విద్యా హక్కు చట్టం నియమాలు రూపొందించబడినప్పుడు 23 ఆగస్టు 2010 ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుండి మినహాయింపు ఇచ్చారనే విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.

15 నుంచి 30 సంవత్సరాలుగా సర్వీసులో ఉండి పాఠశాల విద్యా వ్యవస్థకు వెన్నుముకగా మారిన ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలని చెప్పటం ఆందోళన కలిగిస్తోందన్నారు. దశాబ్దాలుగా విద్యార్దులను తీర్చిదిద్దుతూ, తమ కెరీర్లో ఒక దశకు చేరిన ఈ ఉపాధ్యాయులను ఇప్పుడు ఈ ఎంట్రీ లెవెల్ పరీక్ష రాయమని బలవంతం చేయటం వారిని తీవ్రంగా బాధిస్తున్న సమస్య అని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పీఎకర్ కి తెలిపారు.

అనేక సంవత్సరాల అనుభవం తర్వాత ఇప్పుడు ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తే వేలాది తరగతి గదులు ఉపాధ్యాయులు లేని పాఠశాలలుగా మారవచ్చని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఆగస్టు 2010కి నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కలిగించేందుకు విద్యా హక్కు చట్టం మరియు NCTE చట్టం 1993 కి సవరణలు చేయవలసిందిగా ఎంపీ కోరారు.

ఇదే సమయంలో ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు సరైన చర్యలు తీసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలతో తక్షణం సమావేశాలు నిర్వహించాలని కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. కొద్దిరోజుల కిందటే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఏలూరు క్యాంపు కార్యాలయంలో కలిసి టెట్ సమస్యను వివరించి ఎంపీ సహకారం కోరారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ఎంపీకి ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

Related posts

మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ ‘పొట్టి రఫీ’ అరెస్ట్

Satyam News

వేకువ ఝామున ఆకస్మిక తనిఖీ

Satyam News

తంబళ్లపల్లెలో ‘ ప్రక్షాళన’ పండగ!

Satyam News

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Satyam News

జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ సందేశం ఇదీ….

Satyam News

మదర్సా విద్యార్థులకు, మహిళలకు నూతన వస్త్రాల అందజేత

Satyam News

Leave a Comment