ఆధ్యాత్మికంహోమ్

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

#Tirumala

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏప్రిల్ 10, 24వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

12వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

ఏప్రిల్ 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ భాష్య‌కార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

20న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

21 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ మధురకవి ఆళ్వార్, శ్రీ అనంతాల్వార్ ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

23న శ్రీ భాష్య‌కార్లవారి గంథ‌పుపొడి ఉత్స‌వం, శ్రీ ముదలియాండాన్ స్వామి వారి (దాశరథి) తిరునక్షత్రం.

ఏప్రిల్ 28 నుండి 30వ‌ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం.

Related posts

ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం ఎందుకు?

Satyam News

బడ్జెట్ ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Satyam News

పార్టీ పెడతానంటే కారు కూతలు కూస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు

Satyam News

అమెరికా బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ దాడి

Satyam News

బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్

Satyam News

కూడేరు నీటి సమస్యపై జిల్లా కలెక్టర్‌కు వినతి

Satyam News

Leave a Comment