హైదరాబాద్హోమ్

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో స్ర్కూట్నీ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరి చేస్తూ నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్ లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ మాసంలో అక్రడేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, కమిషనర్ సిహెచ్. ప్రియాంక ప్రకటనలో తెలిపారు.

అదేవిధం జిల్లా స్థాయిలో కూడా ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లు జారీ చేయడం జరుగుతుందని, కావున జిల్లాలో జిల్లా స్థాయి దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.

Related posts

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

Satyam News

నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ

Satyam News

ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

వెలిగొండ జలసిరులు… అభివృద్ధికి రెక్కలు

Satyam News

బలిజ భవన్‌ కల్యాణ మండపం ప్రారంబించిన మంత్రి నారాయణ

Satyam News

కొత్త స్టోరీ: ఇరాన్ అమెరికా చర్చలు మళ్లీ మొదలు?

Satyam News

Leave a Comment