ప్రత్యేకంహోమ్

ఇండక్షన్ స్టౌ లకు పెరిగిన డిమాండ్

దేశంలో పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్న ప్రజలు ఇప్పుడు భారీగా ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ వస్తువుల మార్కెట్‌లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

సాధారణంగా దేశవ్యాప్తంగా నెలకు సగటున 1.80 లక్షల ఇండక్షన్ స్టవ్‌ల విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్‌లో కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 1.34 లక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెలకు జరిగే విక్రయాల్లో దాదాపు 75 శాతం అమ్మకాలు కేవలం 24 గంటల్లోనే జరగడం విశేషం.

గ్యాస్ ధరల పెరుగుదల లేదా సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగానే వినియోగదారులు ఒక్కసారిగా ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలుకు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ డిమాండ్‌ను ఊహించని కంపెనీలు మరియు విక్రేతలు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టాక్ మొత్తం నిమిషాల్లో ఖాళీ అయిపోవడంతో, అమెజాన్ వంటి వెబ్‌సైట్లలో చాలా చోట్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ (Out of Stock) అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. అటు ఆన్‌లైన్‌లోనూ, ఇటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలుదారులు బారులు తీరుతున్నా, తగినంత స్టాక్ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు.

Related posts

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

ఉత్తరాంధ్ర భారీవర్షాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Satyam News

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి

Satyam News

Telangana Weather: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

Satyam News

ఖబడ్దార్ పిన్నెల్లి పిచ్చికూతలు కూస్తే తాటతీస్తాం..!

Satyam News

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

Leave a Comment