ముఖ్యంశాలుహోమ్

హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? బిల్ గేట్స్ పలకరింపు

హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? ఇదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు. సోమవారం ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.

చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ అడిగారు. ఆ తర్వాత తన మంత్రివర్గ సహచరులను, సీఎస్ విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు.

అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్‌ను మంత్రి నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వద్ద బిల్ గేట్స్‌కు స్వాగతం పలికిన బృందంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు.

Related posts

బీహార్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు

Satyam News

శ్రీనివాసమంగాపురంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు

Satyam News

యూరియా నిల్వ చేయవద్దు

Satyam News

విశాఖకు మరో ఘనత..మహిళలకు అత్యంత సురక్షిత నగరం

Satyam News

కుప్పలు తెప్పలుగా తరలివస్తున్న నిరుద్యోగులు

Satyam News

ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

Satyam News

Leave a Comment