మహబూబ్ నగర్హోమ్

పారదర్శకంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా

ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి, వినియోగదారుల భద్రతను పటిష్టం చేయడానికి ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కొన్ని కీలక మార్పులు, నిబంధనలను అమలు చేస్తున్నాయని, వినియోగదారులు వీటిని గమనించి సహకరించవలసిందిగా జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు వినియోగదారులకు సరిపోయేటన్ని ఉన్నాయని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒకసారి గ్యాస్ రీఫిల్ బుకింగ్ చేసుకున్న తర్వాత, తదుపరి సిలిండర్ కోసం బుక్ చేయడానికి కనీసం 45 రోజుల గడువు పాటించాలన్నారు. ఈ కాల పరిమితిలోపు బుకింగ్ చేయడానికి అనుమతి ఉండదన్నారు. 45 రోజుల వరకు ఒక్క సిలిండర్ ను పొడుపుగా వాడుకోవాలని సూచించారు.

వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే బుకింగ్ చేయాలని పేర్కొన్నారు. ఇతర నంబర్ల నుంచి చేసే బుకింగ్‌లు పరిగణనలోకి తీసుకోబడవని, ఒకవేళ ఫోన్ నంబర్ మారినట్లయితే, వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి అప్డేట్ చేసుకోవాలని తెలిపారు.

ఆయా కంపెనీల వారీగా గ్యాస్ సిలిండర్ లను బుకింగ్ చేసుకోవడానికి Indane: 7718955555, HP Gas: 9222201122, Bharat Gas: 7715012345 ఫోన్ నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చన్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటిపి నంబర్ ను డెలివరీ సిబ్బందికి తెలియజేసిన తర్వాతే సిలిండర్ ఇస్తారన్నారు.

వినియోగదారులు రశీదుపై ఉన్న ధరను మాత్రమే డెలివరీ సిబ్బందికి చెల్లించాలన్నారు. అదనపు రుసుములు అడిగితే ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్దార్ 90103 10309 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ లేదా ఇతర ప్రమాద సమయాల్లో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1906 కు సమాచారం అందించాలన్నారు.

వినియోగదారులు ఈ నియమాలను పాటిస్తూ, సురక్షితమైన మరియు సులభతరమైన సేవలను పొందవలసిందిగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

Related posts

బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం

Satyam News

ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్..లోకేష్ 3S ఫార్ములా అదిరింది!

Satyam News

మ్యూనిషన్స్‌ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్‌ మధ్య కీలక ఒప్పందం

Satyam News

డేరా బాబా పై హత్యకేసు కొట్టివేసిన హైకోర్టు

Satyam News

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

Satyam News

ప్రహ్లాద్ జోషీ కి విద్యాశాఖ అదనపు బాధ్యత

Satyam News

Leave a Comment