జాతీయంహోమ్

స్పైస్‌జెట్‌ విమాన సేవలు త్వరలో బంద్?

#Spicejet

స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు మరో సమస్య ఎదురైంది. మాల్డోవాకు చెందిన విమానయాన సంస్థ ఫ్లైఒన్ (FLYONE) తనకు చెందిన మూడు ఎయిర్‌బస్ ఏ320 విమానాలను లీజుకు తీసుకున్న స్పైస్‌జెట్‌పై భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 16 నుంచి తమ విమానాలను నడిపే హక్కు స్పైస్‌జెట్‌కు లేదని స్పష్టం చేసింది.

ఇప్పటికే స్పైస్‌జెట్ ఆర్థిక, నిర్వహణపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నది. ఈ దశలో విమానాల తిరిగి అప్పగింతకు సంబంధించి తాము రూపొందించిన ప్రణాళికలపై స్పైస్‌జెట్ నిర్మాణాత్మకంగా స్పందించడం లేదని ఫ్లైఒన్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని డీజీసీఏను కోరింది. తమ విమానాల విషయంలో స్పైస్‌జెట్‌కు ఉన్న నిర్వహణ హక్కులపై స్పష్టత తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.

స్పైస్‌జెట్‌కు మూడు ఏ320 విమానాలను లీజుకు ఇచ్చిన ఫ్లైఒన్ తాజా లేఖతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. విమానాల తిరిగి అప్పగింత ప్రక్రియ సజావుగా సాగేందుకు స్పైస్‌జెట్ సహకరించడం లేదన్నది ఫ్లైఒన్ ప్రధాన ఆరోపణ. డీజీసీఏ జోక్యంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా, విమానాల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News

దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం

Satyam News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన నటి సుధ

Satyam News

7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కు ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్

Satyam News

రాజంపేట టిడిపి బలోపేతానికి చర్యలు చేపట్టండి

Satyam News

రిలయన్స్ వారసుడు.. ఆంధ్ర దత్త పుత్రుడు.. అనంత్ అంబానీ!

Satyam News

Leave a Comment