ముఖ్యంశాలుహోమ్

కార్పొరేట్ సంస్థలను విమర్శించిన ప్రధాని మోడీ

#Modi

భారీగా పన్ను రాయితీలు కల్పించినప్పటికీ, అందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన, ఉద్యోగుల వేతనాల పెంపు ఎందుకు జరగడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ సంస్థలను ప్రశ్నించారు. ఫిక్కీ (FICCI) సమావేశంలో పాల్గొన్న ఆయన కార్పొరేట్ రంగ ప్రముఖులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ రాయితీల వల్ల లబ్ధి పొందుతున్న కంపెనీలు దేశ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు మరింతగా దోహదపడాలని ప్రధాని సూచించారు. కార్పొరేట్ పన్నును గతంలో ఉన్న 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. అదేవిధంగా కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయం రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రాయితీ కల్పించినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీలు కావాలని కోరుతున్న కార్పొరేట్ సంస్థలు, వాటి ద్వారా వచ్చిన ప్రయోజనాలను ఉద్యోగుల సంక్షేమానికి ఎంతవరకు వినియోగిస్తున్నాయని మోదీ ప్రశ్నించారు. పన్ను తగ్గింపుల వల్ల కంపెనీలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగిందని, మరి దానికి అనుగుణంగా కొత్త ఉద్యోగులను నియమించారా? ఉద్యోగుల జీతాలను పెంచారా? అని నిలదీశారు.

కార్పొరేట్ సంస్థలు కేవలం తమ లాభాల పెంపునకే పరిమితం కాకుండా, దేశంలో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఉద్యోగుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు.

Related posts

వై.ఎస్.జ‌గ‌న్ వి హింసా రాజకీయాలు

Satyam News

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన నిర్మాత కె.ఎస్.రామారావు

Satyam News

36 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల

Satyam News

కాటన్ ఆశయాలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో రెండో రోజు సి ఎస్ ఎం ఆర్ ఎస్ పరీక్షలు

Satyam News

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Satyam News

Leave a Comment