ప్రత్యేకంహోమ్

అమరావతిలో హైటెక్‌ ఫిల్మ్‌ సిటీ….!!

#CinemaShooting

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగం అభివృద్ధికి బూస్ట్‌ ఇచ్చే న్యూస్‌ ఒకటి బయటికొచ్చింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ సిటీ నిర్మించడానికి ప్లాన్‌ సిద్ధమైందట. ఇందుకోసం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సుమారు 500 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో హైటెక్‌ గ్లోబల్‌ ఫిల్మ్‌ సిటీ రాబోతోంది. సినిమా షూటింగులు, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు పబ్లిసిటీ, మార్కెటింగ్‌ కోసం అన్ని సౌకర్యాలతో అమరావతి ఫిల్మ్‌ సిటీని సిద్ధం చేస్తారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినీ పరిశ్రమను ఏపీకి తరలించాలని ప్రజలు ఆశించారు. అప్పటికే హైదరాబాద్‌లో స్టూడియోలు ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండటం.. నటీనటులు, సంగీత, నృత్య కళాకారులు.. టెక్నిషియన్స్ అందరూ భాగ్యనగరంలో స్థిరపడటంతో.. ఇండస్ట్రీని ఏపీకి షిఫ్ట్‌ చేయడం అంత తేలికైన పని కాదని తేలింది. మొత్తం పరిశ్రమను ఒకేసారి తరలించడం సాధ్యం కాదు కాబట్టి.. ఏపీలో సినిమా షూటింగులు ఎక్కువగా చేసేలా ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించింది.

సినిమా స్టూడియోలు.. అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్‌ సిటీలు అందుబాటులోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో సినిమా నిర్మాణ రంగం ఊపందుకొంటే.. స్థానిక ఆర్టిస్టులు, కళాకారులు, టెక్నీషియన్స్‌కి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. ఏపీకి ఆర్ధికంగానూ మేలు జరుగుతుంది. అందుకే ఇండస్ట్రీని ఏపీకి తరలించాలనే ప్రచారాలతో సరిపెట్టకుండా.. స్టూడియోలు, ఫిల్మ్‌ సిటీలు రెడీ చేసి రెడ్ కార్పెట్‌ వేస్తే.. నిర్మాతలు.. దర్శకులు.. ఏపీలో సినిమాల నిర్మాణానికి మొగ్గు చూపించే ఛాన్స్ ఉంటుంది.

Related posts

మల్కాజ్ గిరి  స్టేషన్ లో  8 ఎక్స్ ప్రెస్ లు నిలిపేలా చర్యలు

Satyam News

కుటుంబ వివాదాలతో జగన్‌ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్….!!

Satyam News

గోవా గవర్నర్ విజయనగరం రాక

Satyam News

వీఎస్‌యూలో ముగిసిన ‘ఆంగ్ల బోధన’ జాతీయ సదస్సు

Satyam News

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

Satyam News

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కు నివాళి

Satyam News

Leave a Comment