హైదరాబాద్హోమ్

హైదరాబాద్ పోలీసులతో కలిసి పని చేస్తారా?

#SajjanarIPS

హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న 25ఏళ్లలోపు విద్యార్థుల కోసం ఇంటర్న్ షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్ లను ప్రారంభించారు. ఎంపికైన వారు ఆధునిక పోలీసింగ్, డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పోలీసులకు సహకరించాలి. యువతలోని నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ వారికి పాలనా వ్యవస్థపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

పోలీసింగ్ లో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం మరియు విజ్ఞాన ఆధారిత పోలీసింగ్‌ను బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ వినూత్న ముందడుగు వేసింది. యువత మరియు నిపుణుల నైపుణ్యాలను పోలీస్ విభాగం సంస్థాగత సామర్థ్యం పెంచేందుకు వినియోగించుకునేలా ‘ఇంటర్న్‌షిప్’, ‘వాలంటీర్ ఎంగేజ్‌మెంట్’ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది.

ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వివరాలు:

ఆధునిక పోలీసింగ్ విధానాల్లో యువతలోని సృజనాత్మకతను మరియు విద్యాపరమైన నైపుణ్యాన్ని భాగస్వామ్యం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

అర్హత:

25 ఏళ్ల లోపు వయస్సు కలిగి, ప్రస్తుతం డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

విధులు:

ఎంపికైన ఇంటర్న్‌లకు పోలీస్ శాఖ ప్రాధాన్యతలకు అనుగుణంగా డేటా అనాలిసిస్, పరిశోధన ఆధారిత ప్రాజెక్టులు మరియు నిర్దిష్ట విధులను కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు ప్రభుత్వ పరిపాలన, పోలీసింగ్ వ్యవస్థపై ఆచరణాత్మక అవగాహన లభిస్తుంది.

ప్రశంసా పత్రం:

ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్ అందజేస్తారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ మాట్లాడుతూ “విద్యార్థులు పోలీసు అధికారులతో కలిసి పనిచేస్తూ, విభాగపు పనితీరులో సరికొత్త ఆలోచనలను జోడించడానికి ఇదొక చక్కని వేదిక. ఈ కార్యక్రమం ద్వారా అటు విద్యార్థులకు విలువైన అనుభవం, ఇటు పోలీస్ శాఖకు యువత నుంచి నూతన దృక్పథం లభిస్తాయి” అని అన్నారు.

వివిధ రంగాల్లో అనుభవం ఉన్న నిపుణులు సైతం తమ వంతు సహకారాన్ని అందించేలా వాలంటీర్ అవకాశాలను కల్పించారు. సాంకేతిక లేదా ప్రక్రియ ఆధారిత పనుల్లో (Process-oriented assignments) నిపుణులు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి పోలీస్ విభాగపు అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు తోడ్పడవచ్చు.

ఈ కార్యక్రమాలన్నింటినీ పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో SMIT సెల్ (SMIT Cell) నోడల్ యూనిట్‌గా వ్యవహరిస్తూ సమన్వయం చేస్తుంది. అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ www.hyderabadpolice.gov.in ను సందర్శించండి.

Related posts

మళ్ళీ “పెళ్లి చేసుకుందాం” అంటున్న విక్టరీ వెంకటేష్!

Satyam News

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News

6 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

Satyam News

కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డి

Satyam News

యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలి

Satyam News

విద్యా సంఘాల పేరుతో దౌర్జన్యం వద్దు

Satyam News

Leave a Comment