26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

జల్సాల జగన్ బూట్ల ఖరీదు రూ 2 లక్షలు!

జగన్ జల్సాలకు అంతులేకుండా పోతున్నది. లండన్ పర్యటనకు బయలుదేరిన జగన్ మరో జాతీయ రికార్డు సృష్టించారు. అదేమిటో తెలుసుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సింది ఏమి లేదు. అట్టహాసంగా జగనే విడుదల చేసిన ఫోటో చూస్తే సరిపోతుంది. పేదల పెన్నిధి లా ఫోజు కొట్టే జగన్ వాస్తవానికి పిల్లికి బిచ్చం కూడా పెట్టాడు అని ఆయన సన్నిహితులే చెబుతుంటారు.

ఎవరైనా సాయం కోసం వస్తే ” మూడేళ్లు ఆగమ్మ మన ప్రభుత్వం వస్తుంది ” అని చెప్పడం తప్ప పైసా కూడా ఇవ్వని సంఘటనలు కూడా ఇటీవల కాలంలో చాలా జరిగాయి.

అలాంటి జగన్ ఆస్తి కోసం తల్లి పైనే కేసు వేసిన సంగతి తెలిసిందే. తల్లి పైనే కేసు వేయడం, చెల్లిని ఇంటి నుంచి గెంటివేయడం లాంటి సిగ్గుమాలిన పనులు కూడా తన పత్రిక లో గొప్పగా రాసుకున్నారు.

ఇది ఇలా ఉండగా జగన్ తన కుమార్తెలను చూసుకోడానికి లండన్ ప్రయాణం అయ్యారు. కోర్టు అనుమతి ఇస్తే తప్ప దేశం నుంచి కదల్లేని పరిస్తితి జగన్ ది. అందువల్ల కోర్టుకు దరఖాస్తు చేసుకోగా జగన్ కు షరతుల తో కూడిన అనుమతి వచ్చింది. దాంతో జగన్ లండన్ పర్యటనకు బయలుదేరారు.

లండన్ వెళ్తున్నా అంటూ, జగన్ ఒక డ్రెస్ వేసుకుని ఫోటో దిగాడు.. ఈ ఫోటో లో అతను వేసుకున్న షూస్ చూస్తే, మైండ్ పోతుంది. జగన్ ZEGNA అనే ఇటాలియన్ బ్రాండ్ షూస్ వేసుకున్నాడు. వాటి ధర, అక్షరాల రూ.1.85 లక్షలు… అంటే సగటున ఏపీలో ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాది సంపాదన.. జగన్ వాలంటీర్ 3 సంవత్సరాల సంపాదన… ఈ ఇటాలియన్ బ్రాండ్ షూస్ ని ప్రపంచ కుబేరులు మాత్రమే కొనగలరు. వాళ్ళ కోసం తయారు చేసే బ్రాండ్ ఇది..

నాకు ఉంది, నేను ఊరేగుతా అంటే అది మీ ఇష్టం.. కానీ రూ.1.85 లక్షల షూ ఎవరు వేసుకుంటారు ? నియంత మనస్తత్వం ఉండే వాళ్ళు, ఈజీ మనీతో జనాల దగ్గర దొబ్బి సంపాదించిన వాళ్ళే ఇలాంటి వికృతమైన పనులు చేస్తారు..

ఒక పక్క వందల ఎకరాల్లో ఊరికో ప్యాలెస్, జల్సాలు చేస్తూ, మరో పక్క ఏమీ తెలియని వాడిలా మీడియా ముందు నటించి వెళ్తాడు..

Related posts

పాకిస్తాన్ పైశాచికం: భారత్ నౌకను ఢీ కొట్టిన వైనం…

Satyam News

సూపర్ స్మార్ట్ సిటీ గా నల్గొండ

Satyam News

యువ నాయకత్వానికి తగిన వేదిక స్థానిక ఎన్నికలు

Satyam News

ప్రహ్లాద్ జోషీ కి విద్యాశాఖ అదనపు బాధ్యత

Satyam News

బకాయిల కోసం ఎదురు చూసి కన్నుమూసిన రిటైర్డ్ ఎస్సై

Satyam News

మంగళగిరిని మంత్రి లోకేష్‌ ఏం చేయబోతున్నారు?

Satyam News

Leave a Comment